ధీర
ధీర | |
---|---|
దర్శకత్వం | విక్రాంత్ శ్రీనివాస్ |
రచన | విక్రాంత్ శ్రీనివాస్ |
నిర్మాత | పద్మావతి చదలవాడ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కన్నా పీ.సి |
కూర్పు | వినయ్ రామస్వామి వీ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధీర 2024లో తెలుగులో విడుదలైన సినిమా. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ సినిమాకు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. లక్ష్ చదలవాడ, సోనియా భన్సాల్, నేహా పఠాన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 26న విడుదల చేసి[1], సినిమాను 2024 ఫిబ్రవరి 2న విడుదల చేశారు.[2][3]
కథ
[మార్చు]వైజాగ్ లో రణధీర్ అలియాస్ ధీర (లక్ష్ చదలవాడ) వాహన డ్రైవర్. డబ్బుకోసం ఏ పని అయినా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజ్ గురు అనే కోమా పేషంట్ ని హైదరాబాద్ కి తరలిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. రణధీర్ ఒప్పుకుని ఆ పేషంట్ ని తీసుకుని అంబులెన్స్ లో బయల్దేరతాడు. అదే అంబులెన్స్ లో అతడి మాజీ ప్రేయసి డాక్టర్ అమృత (నేహా పఠాన్) పేషంట్, మరో డాక్టర్‌గా మిర్చి కిరణ్ వస్తాడు. వైజాగ్ నుంచి అంబులెన్స్ లో ఆ పేషంట్ ని తీసుకెళ్తుండగా చాలా మంది రణధీర్ ని వెంబడించి ఆ పేషంట్ ని చంపాలని చూస్తారు. అసలు ఆ పేషంట్ ఎవరు ? పేషంట్ ని సేఫ్ గా చేరిస్తే 25 లక్షలు ఎందుకు ఇస్తున్నారు ? ఆ పేషంట్ కోసం అంతమంది ఎందుకు వెనక పడుతున్నారు? రాజ్ గురు ఎవరు ? వాళ్లందరితో డాక్టర్ అమృతకు ఏంటి సంబంధం ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- లక్ష్ చదలవాడ
- సోనియా భన్సాల్
- నేహా పఠాన్
- మిర్చి కిరణ్
- హిమజ
- నవీన్ నేని
- భరణి శంకర్
- సామ్రాట్
- బాబీ బేడి
- వైవా రాఘవ్
- భూషణ్
- మేక రామకృష్ణ
- సంధ్యారాణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర
- నిర్మాత: పద్మావతి చదలవాడ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:విక్రాంత్ శ్రీనివాస్
- సంగీతం: సాయి కార్తీక్
- సినిమాటోగ్రఫీ: కన్నా పీ.సి
- ఎడిటర్: వినయ్ రామస్వామి వీ
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (27 January 2024). "'ధీర' ట్రైలర్ చూశారా? 25 లక్షల నుంచి 2500 కోట్ల వరకు జర్నీ." (in Telugu). Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (10 January 2024). "ఫిబ్రవరి 2న లక్ష్ చదలవాడ 'ధీర'". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ Sakshi (2 February 2024). "'ధీర' మూవీ రివ్యూ". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.