ధౌళిగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధౌళిగిరి ఒరిస్సా లోని భువనేశ్వర్కు 8 కిలోమీటర్ల దూరంలోని దయానది ఒడ్డునున్న పర్వతంపై నిర్మించబడిన ఒక బౌద్ధక్షేత్రం. చరిత్రలో ఈ ధౌళి ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశంలోనే అశోక చక్రవర్తికి యుద్ధం అంటే విరక్తి కలిగి జ్ఞానోదయం కలిగి బౌద్ధమతాన్ని ఆశ్రయించాడు. శాంతికి చిహ్నమైన శాంతిస్థూపం ఇక్కడే ఉంది.[1]

ధౌళిగిరిలోని శాంతి స్థూపం

చరిత్ర - నిర్మాణం[మార్చు]

అశోక చక్రవర్తి కాలంనాటి రాళ్లకు గుర్తుగా నిర్మించబడింది. 260 బి.సి. నాటి రాళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బౌద్ధ గురువుల సలహాతో 19వ శతాబ్దంలో ఇక్కడ శాంతి స్థూపం నిర్మించబడింది. ఆ శాంతి స్తూపం వలయాకారంలో ఉంటుంది. ఈ స్థూపానికి నాలుగువైపులా నాలుగు బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.

ఇతర వివరాలు[మార్చు]

ఈ శాంతి స్థూపం వెనుకవైపు ఒక శివుని దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పెద్ద శివలింగం, దేవాలయ గోడలో ఒకవైపు అమ్మవారు ఇంకోవైపు గణపతి వెనుకవైపున లక్ష్మీనారాయణ దుర్గాదేవి ఉన్నారు.

చిత్రమాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు నాటీవ్ ప్లానెట్. "భువనేశ్వర్ పర్యాటక ప్రదేశాలు". telugu.nativeplanet.com. Retrieved 28 October 2017.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ధౌళిగిరి&oldid=3155018" నుండి వెలికితీశారు