ధౌళిగిరి
స్వరూపం
(ధౌళి గిరి నుండి దారిమార్పు చెందింది)
ధౌళిగిరి ఒరిస్సా లోని భువనేశ్వర్కు 8 కిలోమీటర్ల దూరంలోని దయానది ఒడ్డునున్న పర్వతంపై నిర్మించబడిన ఒక బౌద్ధక్షేత్రం. చరిత్రలో ఈ ధౌళి ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశంలోనే అశోక చక్రవర్తికి యుద్ధం అంటే విరక్తి కలిగి జ్ఞానోదయం కలిగి బౌద్ధమతాన్ని ఆశ్రయించాడు. శాంతికి చిహ్నమైన శాంతిస్థూపం ఇక్కడే ఉంది.[1]
చరిత్ర - నిర్మాణం
[మార్చు]అశోక చక్రవర్తి కాలంనాటి రాళ్లకు గుర్తుగా నిర్మించబడింది. 260 బి.సి. నాటి రాళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బౌద్ధ గురువుల సలహాతో 19వ శతాబ్దంలో ఇక్కడ శాంతి స్థూపం నిర్మించబడింది. ఆ శాంతి స్తూపం వలయాకారంలో ఉంటుంది. ఈ స్థూపానికి నాలుగువైపులా నాలుగు బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.
ఇతర వివరాలు
[మార్చు]ఈ శాంతి స్థూపం వెనుకవైపు ఒక శివుని దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పెద్ద శివలింగం, దేవాలయ గోడలో ఒకవైపు అమ్మవారు ఇంకోవైపు గణపతి వెనుకవైపున లక్ష్మీనారాయణ దుర్గాదేవి ఉన్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
ధౌళి శాంతి స్థూపం వద్దనున్న బుద్ధ విగ్రహం
-
ముందువైపు ఏనుగు ఆకారం కలిగిన అశోకుని యొక్క ప్రధాన శిలాశాసనం
-
ధౌళిగిరి లేజర్ షో
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Dhauliకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు నాటీవ్ ప్లానెట్. "భువనేశ్వర్ పర్యాటక ప్రదేశాలు". telugu.nativeplanet.com. Retrieved 28 October 2017.[permanent dead link]