నంగేలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

19 వ శతాబ్దంలో కేరళ ట్రావెన్‌కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను విధించేవారు. ఈ పన్నులను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది. కానీ భారతదేశంలోని ఏ చారిత్రక పుస్తకాల్లో ఈ పన్ను గురించి అధికారికంగా గుర్తించబడలేదు.[1]

నేపథ్యం[మార్చు]

ట్రావెన్కోర్ రాజ్యంలో గడ్డాలు,మీసాలపై వక్షోజాలపై పన్ను విధించేవారు.మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా పన్ను వసూలు చేసేవారు.[2]

చరిత్ర[మార్చు]

ట్రావెన్కోర్ రాజ్యం లోని చేరితాలా గ్రామంలో నాంగేలి దంపతులు ఉండేవారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం వీరిది.ట్రావెన్కోర్ రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు. అగ్రకులాలకు చెందిన స్త్రీలు లోన రవికె వేసుకుని, పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది.

ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు వజ్రకోశలు కనపడకుండా వస్త్రాలు ధరించాలంటే కచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి. పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు.రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్ను విధించేవారు.ఈ నిబంధనలు నంగేళి కి నచ్చలేదు. ట్రావెన్ కోర్ రాజు ఆజ్ఞను నంగేళి దిక్కరించింది.

ఒకరోజు నంగేళి వక్షోజాలపై వస్త్రాన్ని ధరించి పొలం పనులకు వెళ్లింది.నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లిన ప్రవతియార్, రాజు ఆదేశాలను మేరకు పన్ను వసూలు కట్టాల్సిందిగా నంగేళి కి చెప్పాడు. రాజు పెట్టిన ఈ ఆచారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి, ప్రవతియార్ ఇంటికొచ్చి బెదిరించడం చూసి ఇంట్లోకి వెళ్లి నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసుకొని అరటి ఆకులో అతనికి సమర్పించండి.ఆమె రక్తం కోల్పోవడంతో వెంటనే మరణించింది.[3]ఆమె భర్త తన భార్య మరణించటం జీర్ణించుకోలేక ఆమె చితిమంటలపై పడి తానూ మరణించాడు.దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి.[4][5][6]

సి.బి.ఎస్.ఇ వివాదం[మార్చు]

తొమ్మిదో తరగతి సోషియాలజీ పాఠ్యపుస్తకంలోని 'కులం, సంఘర్షణ, దుస్తుల మార్పు అనే వచనాన్ని సిబిఎస్‌ఇ తొలగించారు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి సి.బి.ఎస్.ఇ లో ఈ అభ్యంతరకరమైన పాఠన్ని తొలగించాలని సిఫారసు చేసింది.[7]

మూలాలు[మార్చు]

  1. "The woman who cut off her breasts to protest a tax" (in ఆంగ్లం). 2016-07-28. Retrieved 2020-01-19.
  2. W. Crooke. "Nudity in India in Custom and Ritual", Journal of the Royal Anthropological Institute. 1919. p. 239f
  3. "The woman who cut off her breasts to protest a tax" (in ఆంగ్లం). 2016-07-28. Retrieved 2020-01-19.
  4. "The woman who cut off her breasts to protest a tax". BBC News. 28 July 2016.
  5. S. Pillai, Manu (2019). "The woman with no breasts". The Courtesan, the Mahatma and the Italian Brahmin: Tales from Indian History. Chennai: Westland Publications Private Limited. ISBN 9789388689786.
  6. Allen, Charles (2017). Coromandel : A personal history of South India. London: Little, Brown. p. 285. ISBN 9781408705391. OCLC 1012741451.
  7. "దళిత మహిళా పోరాట చరిత్రను సిలబస్ నుండి తొలగించిన సి.బి.ఎస్.ఇ". virasam.org. Retrieved 2020-01-19.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=నంగేలి&oldid=2969257" నుండి వెలికితీశారు