Jump to content

నందివర్ధనం

వికీపీడియా నుండి
(నందివర్ధనము నుండి దారిమార్పు చెందింది)
నందివర్ధనం చెట్టు
నందివర్థనం పువ్వు

నందివర్ధనం (Tabernaemontana లేదా "Milkwood") పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీని శాస్త్రీయ నామం టాబెర్నౌమోంటానా కరోనారియా. ప్రత్యామ్నాయ పేరు ఎర్వాటమియా. ఇది గుబురు పొదలు లేదా చిన్న చెట్లుగా సుమారు 4 నుంచి 8 అడుగుల (1.2 నుండి 2.4 మీ.) ఎత్తు పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి. పువ్వులు ఏడాది పొడవునా వికసిస్తాయి. ఇది ఇంటి పెరటి చెట్టు. ఇది సతతహరితం. ఆకులు వ్యతిరేక కోణాల్లో అమర్చబడి ఉంటాయి. ఆకుల పొడవు 7 నుండి 15 సెం.మీ. వుంటుంది. ఆకులు తెల్లని పాలను కలిగివుంటాయి. నందివర్ధనం పువ్వులు తెల్లగా సువాసనలను వెదజల్లుతూ 1.5 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి. పండు యొక్క గుజ్జు ఎరుపు. మూడు నుండి ఆరు విత్తనాలు ఉంటాయి. దీని వేర్లు చేదుగా వుంటాయి. దీని వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీని పూల రసం కంటి చూపు, చర్మ వ్యాధులకు మంచి ఔషధం. విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు. దీని కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక ఇళ్ల ముందు, ఉద్యానవనాలలో, తోటలలో అలంకరణ చెట్టుగా దీనిని పెంచుతారు. ఆకులు ఆకుపచ్చగా మామిడి ఆకులను ప్రతిబింబిస్తాయి.