నక్షత్రశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సెర్బియా లోని బెల్గ్రేడ్ ప్లానిటోరియం లోపల
Belgrade Planetarium theatre day.jpg
(ప్రదర్శనకు ముందు)
Belgrade Planetarium theatre night.jpg
(ప్రదర్శన సమయంలో)

నక్షత్రశాల అనగా ఒక ధియేటర్, దీనిని ప్రధానంగా ఖగోళశాస్త్రం మరియు రాత్రి ఆకాశం గురించి విద్యా మరియు వినోదాత్మక ప్రదర్శనలు ప్రదర్శించడం కోసం, లేదా ఖగోళ యాన శిక్షణ కోసం నిర్మిస్తారు. నక్షత్రశాలను ఆంగ్లంలో ప్లానిటోరియం అంటారు. అత్యధిక నక్షత్రశాలల యొక్క ప్రాబల్య లక్షణం పెద్ద గుమ్మటం ఆకారంలో ప్రొజెక్షన్ స్క్రీన్ కలిగి ఉండటం, దానిపై నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర విశ్వాంతరాళంలోని వస్తువుల దృశ్యాలు కనిపించటం మరియు అవి విశ్వంలో వాస్తవంగా ఎలా కదులుతాయో అలాగే కదులుతున్నట్లుగా చూపించటం.

బిర్లా నక్షత్రశాల[మార్చు]

బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్ లోగల ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో కల ఈ ఖగోళశాలను 1985 సెప్టెంబరు 8న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారభించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]