Jump to content

బిర్లా నక్షత్రశాల

వికీపీడియా నుండి
బిర్లా నక్షత్రశాలలో వున్నకాకతీయులు కాలమునాటి 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుని విగ్రహం.

బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్ లోగల ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో కల ఈ ఖగోళశాలను 8 సెప్టెంబర్, 1985న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారభించాడు. ఇదే పేరుతో ఖగోళశాలలు కోల్‌కత, చెన్నైలలో కూడా ఉన్నాయి.

ఆకాశం, నక్షత్రాలు, రోదసి, గ్రహణాలు మొదలగు వాటి గురించి ఈ ఖగోళశాలలో వివిధ బాషలలో వివరిస్తూ చూపించే దృశ్యాలు నిజంగా ఆకాశంలో కనిపించే దృశ్యాలకు ఏమాత్రం తీసిపోవు. ఈ దృశ్యాలు చూస్తున్నప్పుడు సందర్శకులకు నిజంగా ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపించడం ప్రత్యేకత. దాదాపు 35 నిమిషాల పాటు జరిగే సందర్శన ప్రతిరోజు తెలుగులో 4 సార్లు, ఆంగ్లంలో 3 సార్లు, హిందీలో ఒకసారి నిర్వహించబడుతుంది. సందర్శకుల తాకిడిని బట్టి ఒక్కోసారి ఉదయం గం.8.15 లకు ప్రత్యేక ప్రదర్శన కూడా నిర్వహిస్తారు.

బయటి లింకులు

[మార్చు]