నక్షత్ర ఆపిల్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
నక్షత్ర ఆపిల్ | |
---|---|
Chrysophyllum cainito fruit | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | rosales
|
Family: | |
Genus: | |
Species: | C. cainito
|
Binomial name | |
Chrysophyllum cainito |
నక్షత్ర ఆపిల్ వృక్ష శాస్త్రీయ నామం Chrysophyllum cainito. నక్షత్ర ఆపిల్ ఉష్ణ మండలానికి సంబంధించిన సపోటేసి కుటుంబానికి చెందిన వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు మధ్య అమెరికా, వెస్ట్ ఇండీస్ లోతట్టు ప్రాంతాలకు చెందినవి. ఈ చెట్టు వేగంగా పెరుగుతూ 20 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ చెట్టును ఆంగ్లంలో స్టార్ ఆపిల్ అంటారు, ఇంకా ఈ చెట్టును బంగారు ఆకు చెట్టు, పాల పండు అంటారు. వియత్నాంలో ఈ చెట్టును సాహిత్యపరంగా రొమ్ము పాలు అని అర్ధం వచ్చేలా పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు సతతహరితంగా, ఆల్టర్నేట్ గా సాధారణంగా అండాకారంలో 5 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు ఆకులను దూరం నుంచి చూసినప్పుడు క్రింది వైపున బంగారం రంగుతో ప్రకాశిస్తుంటాయి. ఈ చెట్టు యొక్క పూత (మిక్కిలి చిన్న పువ్వులు) ఊదా తెలుపు రంగును కలిగి తీపి వాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఈ చెట్టు స్వీయ సారవంతమైన హీర్మాఫ్రాడిటిక్ జాతి కూడా.
-
Cainito fruit cut in half
-
Also available in green or red
-
Freshly plucked Caimitos