నగ్నత్వం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పిల్లల్లో సాధారణంగా కనిపించే నగ్నత్వం.
చిత్రకారుని కెరటం (1896) అనే తైల వర్ణచిత్రం.

దుస్తులు (Clothes) ధరించకుండా ఉండటాన్ని నగ్నత్వం లేదా దిగంబరత్వం (Nudity) అంటారు.

దుస్తులు ధరించడం ఏ జంతువులలోనూ కనపడదు. ఇది మనుషులకే పరిమితమైన ప్రక్రియ. ఎంతవరకు, ఏ రకమైన దుస్తులు ధరించాలనేది వారు నివసించే సాంఘిక స్థితిగతులు, లేదా వాతావరణ పరిస్థితులు లేదా వారి వృత్తుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతి తక్కువగా జననాంగాలు కప్పుకొన్నట్లుగా ధరిస్తే మరికొంతమంది మొత్తం శరీరమంతా కప్పుకుంటారు. పిల్లల్లో నగ్నత్వం సాధారణంగా కన్పిస్తుంది.

భాషా విశేషాలు[మార్చు]

నగ్నము [ nagnamu ] nagnamu. సంస్కృతం adj. Naked.[1] నగ్నంకరణంబులై stripped naked. R. vi. 23. నగ్నత్వము nudity, nakedness. నగ్నవేషము nagna-vēshamu. n. Nudity, a naked figure or appearance. నగ్నవేషధరుడై assuming the appearance of a naked man. నగ్నుడు a naked man, దిసమొలవాడు.

ఆస్ట్రేలియాలో నగ్నంగా ఈతకొడుతున్న వ్యక్తులు

అభిప్రాయాలు[మార్చు]

Love in Wiesbaden (colour).jpg

మనిషి పుట్టినప్పుడు నగ్నంగానే ఉంటాడు. మరళ మరణంలో కూడా పూర్తి నగ్నంగానే వెళిపోతాడు. అయినా నగ్నత్వం గురించి ప్రజల్లో వివిధ రకాల అభిప్రాయాలున్నాయి. కొంతమంది పదిమందిలో తిరిగేటప్పుడు పూర్తిగా దుస్తుల్ని ధరించడానికి ఇష్టపడతారు. అయితే ప్రతివ్యక్తి వివిధ సందర్భాలలో నగ్నంగా ఉంటారు. ఉదాహరణకు స్నానం చేసేటప్పుడు చాలామంది పూర్తిగా నగ్నంగా లేదా అతి తక్కువ దుస్తులు ధరిస్తారు. నిద్ర పోయేటప్పుడు కొంతమంది తేలికైన దుస్తులు ధరిస్తే, మరికొంతమంది పూర్తినగ్నంగా మంచమెక్కుతారు. వైద్యులు రోగిని పూర్తి దిగంబరిగా పరీక్ష చేస్తారు. చాలా తక్కువమందికి నగ్నత్వం ఒక జీవితవిధానం.

భార్యాభర్తలు మరియు ప్రేమికులు సంభోగం సమయంలో సాధారంగా నగ్నంగానే ఉంటారు.

కళలు[మార్చు]

శిల్పం మరియు చిత్రకళలలో మరియు ఛాయాచిత్రాలలో కూడా నగ్నత్వం ఒక భాగం.

కుంభ మేళాలో నగ్నంగా స్నానం చేస్తున్న సాధువులు.

పాశ్చాత్య చిత్రలేఖనంలో వీనికి మంచి ప్రాచీనత (Antiquity) ఉంది. మికిలాంజిలో, లియొనార్డో డావిన్సి మొదలైన చిత్రకారులు నగ్నసుందరీమణులను మోడల్ గా ఎన్నో ఉన్నత విలువలు గల చిత్రపటాల్ని వేశారు. ఖజురహో మొదలైన ప్రాచీన భారతీయంలో ఎన్నో సుందరమైన శిల్పాలు నగ్నంగానే దర్శనమిస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నగ్నత్వం&oldid=2161103" నుండి వెలికితీశారు