నడిపించు నానావ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రులకు నడిపించు నానావ ఏ.బి.మాసిలామణి గారు రచించిన చిరస్మరణీయమైన గేయం, క్రైస్తవ సంకీర్తన.[1] పాట తెలుగు క్రైస్తవలోకాన్ని మనోహరమైన ఆత్మీయతానుభవాల అత్యున్నతమైన అంచుల్లోకి తీసుకెళ్లిన భక్తి గీతం. మహాద్భుత క్రైస్తవ వక్తగా, రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన రెవ. డా. ఎ.బి. మాసిలామణి రాసిన ఆణిముత్యంలాటి భక్తి గీతమది. లక్షలాది హృదయాలను స్పృశించిన మధురగీతం అది. జీవితంలో వైఫల్యానికి, విజయానికి మధ్యగల అగాథంలో యేసుక్రీస్తు నిండితే, అదెంత ఫలభరితమో తెలుపుతూ పరోక్షంగా అపోస్తలుడైన పేతురు జీవితానుభవాల పందిరికి అల్లిన గీతం అది. [2]

నడిపించు నా నావ పాటలో ప్రభుమార్గము విడిచితిని- ప్రార్థించుట మానితిని  ప్రభువాక్యము వదిలితిని- పరమార్థము మరచితిని  ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై- ఇప్పుడు పాటింతు నీ మాట  అన్న చరణం మాసిలామణి నిజాయితీకి, నిష్కల్మషత్వానికి, నిర్భయత్వానికి నిదర్శనం.

పాటలో కొంత భాగం

[మార్చు]

. ॥నడిపించు నా నావ, నడిసంద్రమున దేవ॥ ॥నవజీవనమార్గమున, నా జన్మ తరియింప

నా జీవిత తీరమున, నా అపజయ భారమున నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు నాయాత్ర విరబూయ, నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము, నా సేవ జేకొనుము

॥ నడిపించు నా నావ... ॥

రాత్రంతయి శ్రమపడినా, రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ, రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ, రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవ

॥నడిపించు నా నావ... ॥

మూలాలు

[మార్చు]
  1. "నడిపించు నా నావా నడి సంద్రమున దేవా | Nadipinchu Naa Naava". తెలుగు క్రిస్టియన్ లిరిక్స్ | Telugu Christian Lyrics (in ఇంగ్లీష్). Retrieved 2023-04-22.
  2. "మనకు తెలిసిన మధుర గీతం... నడిపించు నా నావ". Sakshi. 2014-12-24. Retrieved 2023-04-22.

బాహ్య లంకెలు

[మార్చు]
  • Vahini, Sajeeva. "Telugu Bible". sajeevavahini.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-22.