నన్నపనేని రాజకుమారి
నన్నపనేని రాజకుమారి | |
---|---|
చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | |
In office 6 సెప్టెంబరు 2014 – 2020 | |
చీఫ్ విప్, సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రిణి | |
In office 1990–1995 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఆధారం చూపాలి] సరిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1948 అక్టోబరు 9 [
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవిత భాగస్వామి | నన్నపనేని ముకుందరావు |
సంతానం | రఘు, సుధ్ |
నివాసం | మాసబ్ ట్యాంకు, హైదరాబాదు, భారతదేశం |
వెబ్‌సైట్ | http://www.telugudesam.org |
Ntg |
నన్నపనేని రాజకుమారి భారతదేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగు దేశం పార్టీ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కౌన్సిల్ కు చైర్ పర్సన్ గా పనిచేసింది. ఆమె తెలుగుదేశం పార్టీ కి అధికార ప్రతినిధి.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆమె ఆ పార్టీలో చేరింది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యురాలిగా రెండుసార్లు సత్తెనపల్లి (1983–1985)[4] నుండి, ఒకసారి వినుకొండ (1989–1994).[5] శాసన సభ నియోజక వర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నికయింది. ఆమె నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిణిగా పనిచేసింది.
ఆమె ఆంధ్రప్రదేశ్ లోని ఎన్.జనార్థనరెడ్డి, డా.మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో చీఫ్ విప్ గా పనిచేసింది. ఆమె ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. ఆమె తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసింది.
కొన్ని సమూహాల ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 20 డిసెంబరు 2009 నుండి తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించింది.
2009 డిసెంబరు 9న ఫెడరల్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించింది. తరువాత డిసెంబరు 23 న స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజా సమూహాలతో విస్తృతంగా సంప్రదించిన తరువాత మాత్రమే ప్రారంభమవుతుంది అని ప్రకటించింది. ఫెడరల్ ప్రభుత్వం నుండి ఈ ప్రకటన తర్వాత రాజకుమారి తన సమ్మెను విరమించుకుంది.[6]
ఆమె రచయిత్రిగా "నన్నపనేని నవరత్నాలు" అనే 9 నవలలను రాసింది
సినిమాలు
[మార్చు]ఆమె తారక రత్న చిత్రం విజేత లో న్యాయమూర్తి పాత్రలో నటించింది. [7]
మూలాలు
[మార్చు]- ↑ "Can Chandrababu Naidu come back to power in Andhra Pradesh on his Rs 70,000 crore crop loan waiver scheme? : South, News - India Today". Indiatoday.intoday.in. 2012-11-23. Retrieved 2013-07-19.
- ↑ "Andhra Pradesh / Hyderabad News : Nannapaneni demands action against Nagam". The Hindu. 2011-03-23. Archived from the original on 2012-05-19. Retrieved 2013-07-19.
- ↑ "Telangana divide all pervasive here : Latest Headlines, News - India Today". Indiatoday.intoday.in. 2009-12-23. Retrieved 2013-07-19.
- ↑ "Sattenapalli Assembly Constituency Details". Archived from the original on 2 సెప్టెంబరు 2013. Retrieved 3 జూన్ 2021.
- ↑ "Vinukonda Assembly Constituency Details". Archived from the original on 7 జూన్ 2013. Retrieved 3 జూన్ 2021.
- ↑ "Nannapaneni pulls a fast one". The New Indian Express. 2009-12-22. Archived from the original on 2016-03-04. Retrieved 2012-05-27.
- ↑ "Nannapaneni appearing as justice in 'Vijetha'". indiaglitz.com. Archived from the original on 17 డిసెంబరు 2012. Retrieved 16 December 2012.
బాహ్య లంకెలు
[మార్చు]- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from October 2018
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1948 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- గుంటూరు జిల్లా వ్యక్తులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1983)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1989)