నన్నారి షర్బత్
నన్నారి షర్బత్ ఒక శీతల పానీయము. ఇది రాయలసీమలో ఎక్కువగా లబిస్తుంది.
తయారీ
[మార్చు]ఈ షర్బత్ తయారీకి ముడి పదార్థం [సుగంధి పాల చెట్టు వేరు] నుండి లభిస్తుంది.[1]రాయలసీమలో ఎక్కువగా లభించే వనమూలికలలో వట్టివేరు ఒకటి.రాయలసీమలో ఎక్కువగా పెరిగే వనమూలికల చెట్లలో సుగంధిపాల చెట్టు ఒకటి.ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో పెరిగి భూమిలోకి వెళతాయి.ఈ వేర్లు ఆరోగ్యానికి చాలా మంచివని అయుర్వేదం చెప్తోంది.శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పండ్లు,చెట్టు వేర్లు కూడా ఉపయోగపడతాయి.అలా ఉపయోగపడే వేర్లున్న చెట్టు సుగంధపాల .కడప జిల్లాలోని బద్వేలు, రాజంపేట, సిద్ధవటం మొదలైన ప్రాంతాలలో ఈ సుగంధపాల చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
- ఈ సుగంధిపాల చెట్లు వేర్లని కత్తిరించేసి, ఎండలోపెట్టి,వీటిని నీళ్ళలో మరిగించి పంచదారకలిపి ఒక చిక్కని ద్రవాన్ని తయారు చేస్తారు.ఇలా చేసిన సిరప్ ని నన్నారి అంటారు.
- ఒక గ్లాసులో కొద్దిగా నన్నారిని పోసి,అందులో ఒక నిమ్మకాయను పిండి,చల్లటి సోడాను కొట్టి గ్లాసులో పోసి ఇస్తారు.దీనినే నన్నారి షర్బత్ అంటారు
లాభాలు
[మార్చు]- రాయలసీమ జిల్లాల్లో వేసవికాలం వేడికి,చల్లటి నన్నారి షర్బత్ మంచి ఔషధం లా పనిచేస్తుంది.
ఒకప్పుడు కడపజిల్లాలో మాత్రమే దొరికే ఈ నన్నారి ద్రవము ఇప్పుడు మిగిలిన జిల్లాలకి విస్తరించింది.అన్నిచోట్లా దొరుకుతోంది ఈ నన్నారి షర్బత్.కానీ రాయలసీమలో దొరికే నన్నారి షర్బత్ రుచిముందు ఇవి అంతపేరు తెచ్చుకోలేదు.షర్బత్ అంటే నన్నారి షర్బత్ అదీ రాయలసీమ మాత్రమే అనేంత పేరు తెచ్చుకున్న ఈ నన్నారి షర్బత్ ని ఒకసారి తాగితే వదిలిపెట్టరు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-28. Retrieved 2017-04-24.