నమలడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గట్టిగా యున్న గడ్డి పరకల్ని నములుతున్న కోతి.

నమలడం (Mastication or Chewing) జీర్ణ ప్రక్రియలో మొదటి భాగం.

నమిలేటప్పుడు ఆహార పదార్ధాలు పండ్ల మధ్యన పడి చిన్నవిగా చేయబడతాయి. అందువలన జీర్ణద్రవాలలోని ఎంజైమ్లు బాగా పనిచేసి ఆహారాన్ని సులభంగా జీర్ణించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియలో నాలుక, బుగ్గలు సహకరిస్తాయి. నమలడం పూర్తయేసరికి ఆహారం మెత్తగా మారి లాలాజలంతో కలిసి ముద్దలాగా తయారౌతుంది. కార్బోహైడ్రేట్లు కొంతవరకు జీర్ణించబడతాయి. ఆ తర్వాత అన్నవాహిక ద్వారా జీర్ణకోశాన్ని చేరుకుంటుంది.

కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు కొంత నమిలిన ఆహారాన్ని తినిపిస్తారు. దీనిని Premastication అంటారు. అందువలన పిల్లలు సులువుగా జీర్ణించుకోగలుగుతారు.[1]

జంతువులు

[మార్చు]

నెమరువేయు జంతువులైన పశువులలో గడ్డి మొదలైన వాటిని రెండుసార్లు నములుతాయి. అదే మాంసాహార జంతువులు తమ ఆహారాన్ని పెద్ద పెద్ద కండలుగా ఒకేసారి నమలకుండా మింగేస్తాయి.

నమిలే కండరాలు

[మార్చు]

ఈ క్రింది నమిలే కండరాలు (Muscles of Mastication) అన్ని జతగా ఉంటాయి.

  • మాసెటర్ కండరం (Masseter muscle)
  • టెంపొరాలిస్ కండరం (Temporalis muscle)
  • మీడియల్ టెరిగాయిడ్ కండరం (Medial pterygoid muscle)
  • లేటరల్ టెరొగాయిడ్ కండరం (Lateral pterygoid muscle)

యంత్రాలు

[మార్చు]
Masticator on the Zaca Fire

ఇలాంటి నమిలే ప్రక్రియను కొన్ని యంత్రాలలో ప్రవేశపెట్టారు. అమెరికాలోని మాస్టికేటర్ అనే యంత్రం అగ్నిప్రమాదాలలో ఉపయోగించే యంత్రాన్ని ఉపయోగిస్తున్నది.[2]

మూలాలు

[మార్చు]
  1. Holmes, Wendy (2007), "Influences on maternal and child nutrition in the highlands of the northern Lao PDR", Asia Pac J Clin Nutr, 16 (3): 537–545
  2. "Masticator shown and described at interagency Inciweb.org". Archived from the original on 2008-08-28. Retrieved 2011-09-03.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నమలడం&oldid=2887822" నుండి వెలికితీశారు