Jump to content

నమితా థాపర్

వికీపీడియా నుండి
నమితా థాపర్
2019లో నమితా థాపర్
జననం (1977-03-21) 1977 మార్చి 21 (వయసు 47)
పుణె, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతబారతీయురాలు
విశ్వవిద్యాలయాలుఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ , బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్
వృత్తివ్యాపారవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1996–ప్రస్తుతం
సంస్థఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌
టెలివిజన్షార్క్‌ ట్యాంక్‌ ఇండియా (2021–ప్రస్తుతం)
భార్య / భర్త
వికాస్ థాపర్
(m. 2013)
పిల్లలు2

నమితా థాపర్ (జననం 1977 మార్చి 21) ఒక భారతీయ పారిశ్రామికవేత్త, వ్యాపార కార్యనిర్వాహకురాలు, ఏంజెల్ పెట్టుబడిదారు.[1] ఆమె ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.[2] షార్క్ ట్యాంక్ ఇండియా 100 కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంలో ఆమె ప్రముఖ పెట్టుబడిదారుగా కూడా ఉంది. ఆమె థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీని కూడా స్థాపించింది.[3]

నమితా థాపర్ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయింది.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

నమితా వ్యాపారవేత్త సతీష్ రామన్ లాల్ మెహతా కుమార్తె.[4][5] ఆమె 2001 లో డ్యూక్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబిఎ పూర్తి చేసింది, ఐసిఎఐ నుండి చార్టర్డ్ అకౌంటెంట్ కూడా.[6]

కెరీర్

[మార్చు]

ఎంబీఏ పూర్తి చేసిన తరువాత, ఆమె గైడాంట్ కార్పొరేషన్లో బిజినెస్ ఫైనాన్స్ హెడ్ పాత్రను పోషించడానికి అమెరికాకు వెళ్ళింది. తరువాత, ఆమె భారతదేశానికి మకాం మార్చింది, అక్కడ ఆమె ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ సిఎఫ్ఓ పాత్రను పోషించింది.[7] ఆ తర్వాత ఆమె కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమితులయింది.

షార్క్ ట్యాంక్

[మార్చు]

సీజన్ 1,2, 3 సోనీలివ్ రియాలిటీ ప్రోగ్రామ్ షార్క్ ట్యాంక్ ఇండియా నమితా "షార్క్" గా ఉంది.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె వికాస్ థాపర్ ను వివాహం చేసుకుంది.[9] వారికి ఇద్దరు అబ్బాయిలు - జై, వీర్.[10]

మూలాలు

[మార్చు]
  1. "When Shark Tank India's Namita Thapar addressed being called a 'nepo-kid' and 'papa ki pari'; says 'one needs to have entrepreneurial mindset' - Exclusive". The Times of India. 14 March 2024.
  2. "Namita Thapar: Growth Champion". 10 December 2021.
  3. "అప్పుడు రెండుసార్లు ఐవీఎఫ్ విఫలమైంది.. ఆ బాధను తట్టుకోలేకపోయా | leading-business-lady-namita-thapar-shares-about-her-ivf-failure-story-inspiring-many". web.archive.org. 2024-05-25. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Namita Thapar shuts down troll who asked: 'if daddy's money hadn't been there…'". 13 March 2024.
  5. "Queen size". The Times of India.
  6. "namita thapar Profile".
  7. "Meet Namita Thapar: The businesswoman with a Rs 600 crore net worth, Rs 50 crore mansion, and a taste for luxury". 15 February 2024.
  8. "Shark Tank India : వివక్షను దాటి.. వ్యాపారాల్లో రాణిస్తున్నారు | inspiring-business-journey-of-these-three-women-sharks-in-shark-tank-india-season-3-in-telugu". web.archive.org. 2024-05-25. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Namita Thapar, husband Vikas invite Shark Tank India sports pitchers to their home for dinner; former shares their success story". The Times of India. May 2023.
  10. "Shark Tank India judge Namita Thapar lives life queen size with hubby Vikas Thapar and kids; here's all about her early days, education and net worth". The Times of India.