నయన జేమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నయన జేమ్స్
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయురాలు
జననం (1995-10-18) 1995 అక్టోబరు 18 (వయసు 28)
పెరంబ్రా కోజికోడ్, కేరళ, భారతదేశం[1]
విద్యమార్ ఇవానియోస్ కళాశాల - కేరళ విశ్వవిద్యాలయం
ఎత్తు1.74 m (5 ft 9 in)
బరువు62 kg (137 lb)
క్రీడ
దేశంభారతదేశం
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
పోటీ(లు)లాంగ్ జంప్
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)6.55 (పాటియాలా 2017)

నయన జేమ్స్ (జననం 1995 అక్టోబరు 18) లాంగ్ జంప్ ఈవెంట్‌లో పోటీపడుతున్న ఒక భారతీయ క్రీడాకారిణి.[2][3][4]

ఆమె 2017 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ – మహిళల లాంగ్ జంప్లో కాంస్య పతకాన్ని, ఆమెతో పాటు మరో భారతీయ క్రీడాకారిణి నీనా వరాకిల్ రజతం సాధించింది.[5]

ప్రారంభ జీవితం[మార్చు]

నయన జేమ్స్ కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో 1995 అక్టోబరు 18న జన్మించింది.[6] ఆమె కోజికోడ్‌లోని సెయింట్ జార్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు మాజీ అథ్లెట్ అయిన కె.ఎమ్ పీటర్ ఆమెకు క్రీడలపట్ల ఉన్న మక్కువ కనుగొన్నాడు. 2010లో, ప్రఖ్యాత క్రీడాకారిణి మయూఖా జానీ మాజీ కోచ్ అయిన జోస్ మాథ్యూ వద్ద శిక్షణ పొందేందుకు ఆమె కేరళలోని తలస్సేరిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరింది.[2]

కెరీర్[మార్చు]

2017లో పాటియాలాలో జరిగిన 21వ ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఆమె ప్రసిద్ది చెందింది. ఆమె లాంగ్ జంప్ ఈవెంట్‌లో 6.55 మీటర్ల జంప్‌ను నమోదు చేసింది, ఇది ఆమె వ్యక్తిగత అత్యుత్తమం.[3] పాటియాలాలో జరుగుతున్న 22వ ఫెడరేషన్ కప్‌లో లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఆమె మరో స్వర్ణం సాధించి తన పరంపరను కొనసాగించింది.

లాంగ్ జంప్ ఈవెంట్ చరిత్రలో ఆమె 6.55 మీటర్ల జంప్ చేసి టాప్ 5 భారతీయ క్రీడారులలో ఒకరిగా నిలిచింది. 2018లో, ఆమె కామన్వెల్త్ గేమ్స్ మహిళల లాంగ్ జంప్ ఈవెంట్‌లో 12వ స్థానంలో నిలిచింది. 2018 ఆసియా ఇండోర్ గేమ్స్‌లో, మహిళల లాంగ్ జంప్‌లో ఆమె 6.08 మీటర్ల ఎత్తుతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

మూలాలు[మార్చు]

  1. "2018 CWG bio". Archived from the original on 29 ఏప్రిల్ 2018. Retrieved 28 April 2018.
  2. 2.0 2.1 "Is Nayana James next big thing after Anju Bobby George". The Times of India. 2 July 2017. Retrieved 7 July 2017.
  3. 3.0 3.1 "Nayana James steals the thunder at Federation Cup". The Times of India. 2 July 2017. Retrieved 7 July 2017.
  4. "Nayana James makes big strides". The Asian Age. 9 November 2011. Retrieved 7 July 2017.
  5. "Asian Athletics Championships 2017: List of all medal winners for India". 2017-07-10. Retrieved 2017-07-14.
  6. "Athletics | Athlete Profile: Nayana JAMES - Gold Coast 2018 Commonwealth Games". results.gc2018.com (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-04-29. Retrieved 2018-08-25.