Jump to content

నయీమ్ అష్రఫ్

వికీపీడియా నుండి
నయీమ్ అష్రఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నయీమ్ అష్రఫ్
పుట్టిన తేదీ (1972-11-10) 1972 నవంబరు 10 (వయసు 52)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
బంధువులుజాస్మిన్ నయీమ్ (భార్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1995 ఏప్రిల్ 07 - ఇండియా తో
చివరి వన్‌డే1995 ఏప్రిల్ 11 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987/88–1989/90Lahore City
1992/93—1999/00 National Bank of Pakistan
1993/94–1998/99Lahore City
2000/01Lahore Whites
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 86 92
చేసిన పరుగులు 24 3,009 1,047
బ్యాటింగు సగటు 24.00 26.16 19.38
100s/50s 0/0 5/10 0/4
అత్యధిక స్కోరు 16 139 65*
వేసిన బంతులు 42 14,375 4,271
వికెట్లు 0 289 97
బౌలింగు సగటు 24.12 30.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 17 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3 0
అత్యుత్తమ బౌలింగు 7/41 4/45
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 47/– 27/–
మూలం: [2], 2023 జూలై 2

నయీమ్ అష్రఫ్, పాకిస్తానీ మాజీ క్రికెటర్, క్రికెట్ అంపైర్. 1995లో రెండు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.[1] నయీమ్ ఎడమచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని లంకాషైర్‌లో ఉన్న క్లిథెరో క్రికెట్ క్లబ్‌లో ఆడుతున్నాడు.

జననం, కుటుంబం, విద్య

[మార్చు]

నయీమ్ అష్రఫ్ లాహోర్‌లో అజ్రా బేగం - మహమ్మద్ అష్రఫ్‌ దంపతులకు జన్మించాడు. ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులతో మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. నయీమ్ లాహోర్‌లోని ముస్లిం మోడల్ హైస్కూల్, లాహోర్‌లోని మాయో కళాశాలలో చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇంగ్లాండ్‌లో, 2000 వేసవి క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, నయీమ్ తన భాగస్వామి జాస్మిన్‌ను కలిశాడు. 2020 జూన్ 15న, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఇస్లామిక్ వేడుకలో నయీమ్ జాస్మిన్‌ను వివాహం చేసుకున్నాడు.

క్రికెట్ క్రికెట్

[మార్చు]

1995లో, నయీమ్ రీడ్‌లోని రీడ్ క్రికెట్ క్లబ్‌లో వారి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా చేరాడు.[2] 1997లో నయీమ్ బ్లాక్‌బర్న్‌లోని చెర్రీ ట్రీ క్రికెట్ క్లబ్‌లో వారి ప్రొఫెషనల్‌గా చేరాడు. 2003 నుండి ఏడు సంవత్సరాలకు పైగా సిటిసిసి కోసం ఆడాడు. ఏడు సంవత్సరాలలో సిటిసిసి ఆరు కప్ ఫైనల్స్ ఆడింది, మూడు ఫైనల్స్, రెండు లీగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.

బ్యాటింగ్ చేస్తున్న నయీమ్ అష్రఫ్

మూలాలు

[మార్చు]
  1. Cricinfo profile: Naeem Ashraf. URL accessed 2023-09-05.
  2. [1] Archived 2008-05-11 at the Wayback Machine, URL accessed 2023-09-05.