Jump to content

నరసింహకొండ

వికీపీడియా నుండి
శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రచురించిన వాల్ పోస్టర్

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు నరసింహకొండ.[1][2] ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపై ఉండుట వలన ఈ కొండను నరసింహకొండ అని పిలిచేవారు, ఈ కారణంగానే ఈ కొండ దిగువ భాగాన, కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న ఊరికి నరసింహకొండ అనే పేరు వచ్చింది.

పవన విద్యుత్

[మార్చు]

నెల్లూరు జిల్లాలో ఇక్కడ చాలా కాలం నుంచే పవన విద్యుత్ పరికరాలను అమర్చి విద్యుత్ను తయారు చేస్తున్నారు.

పెన్నానది

[మార్చు]

పెన్నానది, కొండ ప్రాంతం, అందమైన ప్రదేశాలు చూడముచ్చటగా ఉండి, భక్తులనే కాక ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులను సైతం ఆకర్షిస్తూ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది.

విద్య

[మార్చు]

ఇక్కడ నారాయణ విద్యాసంస్థ స్థాపించిన విద్యాలయం మరొక ప్రత్యేక ఆకర్షణ.phone no-9100123563

డిస్టిలరీస్

[మార్చు]

ఇక్కడ ఊరికి కొంచెం దూరంలో పూర్వం ప్రభుత్వ సారాయి (తయారీ, ) హోల్ సేల్ విక్రయ కేంద్రం ఉండేది, ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం జిల్లాలోని బ్రాందీషాపులకు అవసరమయ్యే డిస్టిలరీస్ సరుకుల గోడౌన్‍గా ఉపయోగిస్తున్నారు.

ప్రయాణ మార్గాలు

[మార్చు]

నెల్లూరు నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ప్రతి 30 నిముషములకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Narasimha Konda". Sri Lakshmi Narasimha Kutumbam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-10.
  2. "Narasimha Konda | IndiaUnveiled". www.indiaunveiled.in (in ఇంగ్లీష్). Retrieved 2022-06-10.

బయటి లింకులు

[మార్చు]