నరసింహాపురం (కోడూరు)

వికీపీడియా నుండి
(నరసింహాపురం కోడూరు, కృష్ణా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నరసింహాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

నరసింహాపురం, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. సమీప రైల్వేస్టేషన్: రేపల్లె 25 కి.మీ, మచిలీపట్నం 30 కి.మీ, గుడివాడ 70 కి.మీ, గుంటూరు 90 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న జరుగు లక్ష్మీవర్ధన్ అను విద్యార్థి, ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్షలలో విజయం సాధించి, నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత పొందినాడు. [3]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామం కోడూరు గ్రామ పంచాయతీకి శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం

[మార్చు]

గ్రామంలో 1952 లో నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకొనడంతో, 2015,మే-30న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. గ్రామస్థులు, దాతలు, భక్తుల ఆర్థిక సహకారంతో, ఒక కోటి రూపాయలకు పైగా వెచ్చించి నూతన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఈ నూతన ఆలయంలో క్రింద కళ్యాణ మండపం, పై అంతస్తులో ఆలయాన్ని నిర్మించారు. రాజమహేంద్రవరానికి చెందిన శిల్పులు, ఆలయంపై అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో కళాత్మకంగా రూపుదిద్దినారు. గోడలపై శ్రీరామ పట్టాభిషేకం, హనుమంతుడు శ్రీరాముడిని ఆలింగనం చేసుకునే విగ్రహ ప్రతిమలను రూపొందించారు. హనుమంతుడు, శ్రీ సీతారామలక్ష్మణుల పాలరాతి విగ్రహాలను జైపూరు నుండి తీసికొనివచ్చారు. 2017,మే నెల 10వతేదీ బుధవారంనాడు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుములు, పెసలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కీ.శే.డా.రావి రామకృష్ణ పి.హెచ్.డి. (1.6.1954 - 21.3.2016) వీరు నిత్య కృషీవలురు, ప్రముఖ ఆక్వాశాస్త్రవేత్త, మానవతామూర్తి.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామస్థులైన శ్రీ ఆలూరి లక్ష్మీనారాయణ గారు హైదరాబాదులోని శ్రీ ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహాయ రిజిస్ట్రరుగా పదవీ విరమణ పొందారు. వీరు తమ స్వగ్రామమైన నరసింహాపురం మీద, నరసింహాపురం - గ్రామ ఇతిహాసం అను పుస్తకం రచించారు. సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారు దీనిని ప్రచురించారు. వీరిని 2014,మార్చ్-23, ఆదివారం నాడు, నరసింహాపురం గ్రామంలో గ్రామపెద్దల సమక్షంలో, "ఉప్పల రాజ్యలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులైన శ్రీ ఉప్పల శ్రీనివాసరావు ఘనంగా సన్మానంచేశారు. వీరు వ్రాసిన పుస్తకాన్ని గ్రామంలో ఆదివారం నాడు ఆవిష్కరించారు. [1]&[2]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-13; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-25; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-2; 1వపేజీ.[4] [ఈనాడు అమరావతి/అవనిగడ్డ;2017.మే-4;2వపేజీ