నరుహితో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరుహితో
జపాన్ చక్రవర్తి
Reign2019 మే 1 – ప్రస్తుతం
జపాన్2019 అక్టోబరు 22
Predecessorఅకిహితో
Successorఫుమిహితో
Regentషింజో అబే
యోషిహిదే సుగా
జననం (1960-02-23) 1960 ఫిబ్రవరి 23 (వయసు 64)
టోక్యో, జపాన్
Spouse
మాసకో ఓవాద
(m. 1993)
తండ్రిఅకిహితో
తల్లిమిచికో శోద

నరుహితో(徳仁, pronounced [naɾɯꜜçi̥to];జననం 1960 ఫిబ్రవరి 23) జపాన్ దేశ చక్రవర్తి.[1]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

నరహితో 1960 ఫిబ్రవరి 23న టోక్యో నగరంలో జన్మించాడు. 4 సంవత్సరాల వయస్సులో, అతను జపాన్‌లో ప్రాథమిక పాఠశాలలో చేరాడు. అతను కక్షు విశ్వవిద్యాలయం నుండి చరిత్ర అంశంతో 1982లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నరుహితో జూన్ 9, 1993 న మసకో ఓవాదను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, ప్రిన్సెస్ ఐకో డిసెంబర్ 1, 2001 న జన్మించింది.

జపాన్ చక్రవర్తిగా

[మార్చు]

2017 డిసెంబర్ ఒకటిన జపాన్ ప్రభుత్వం నరుహితో తండ్రి అకిహితో 2019 ఏప్రిల్ 30న జరిగే పదవి విరమణ గురించి తెలియజేస్తూ 2019 మే 1 నుండి జపాన్ సామ్రాజ్య 126వ చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు చేపడతాడని ప్రకటించింది. అకిహితో చక్రవర్తిగా ఉన్న కాలంలో హెఐసీ శకం ఉంది. 2019 మే 1 నుండి రేయివ శకం మొదలైంది. తన తండ్రి తరువాత చక్రవర్తిగా బాధ్యతలు చేపడుతున్న నరుహితో తన బాజీతాలు సక్రమంగా నిర్వహిస్తాను అని మే 1న ప్రమాణ స్వీకారం చేసాడు. [3]

మూలాలు

[మార్చు]
  1. "National Day of Japan to be celebrated". Embassy of Japan in Pakistan. 7 December 2007. Archived from the original on 2 February 2008. Retrieved 28 December 2007.
  2. Fitzpatrick, Beth Cooney (January 21, 2011). "Great Royal Weddings: Princess Masako and Crown Prince Naruhito". Stylelist. AOL. Archived from the original on 10 September 2011. Retrieved 2 December 2016.
  3. "Emperor Akihito to abdicate on April 30, 2019". japantoday.com. Archived from the original on 3 December 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=నరుహితో&oldid=3402290" నుండి వెలికితీశారు