నరేష్కుమార్ సూఫీ, కవి సంగమం రచయితలలో ఒకరు. ఈయన రచనలు, వ్యాసాలు ఈ మాట, వన్ ఇండియా, భూమిక, సారంగ, అవని న్యూస్, రస్తా మొదలైన ఆన్ లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అలాగే పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు.
జాతీయ స్థాయి కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో (2018) నరేష్కుమార్ సూఫీకి మామిడి హరికృష్ణ సత్కారంఉద్యమ కవితా శివసాగరం
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో తన కవిత్వాన్ని చదువుతున్న నరేష్కుమార్ సూఫీ
సూఫీ 2019లో "నిశ్శబ్ద" పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. "‘‘కవి కడుపుతో ఉంటాడు, కవిత్వాన్ని కంటాడు, కవిత రాయటం ఓ అద్భుతం, నాలో రగిలే అగ్గిని ఈ సమాజం మీదికి వెలుగులా విసురుతున్నా... బ్లా బ్లా బ్లా! యేమో, నేనెప్పుడూ కవిత్వాన్ని పెద్దగా ప్రేమించలేదు, కవిత్వం రాయటాన్ని అద్భుతంగా ఫీలవ్వలేదు కూడా. రాయటం అంటే సమాజం, సాహిత్య ప్రయోజనం అన్నాడూ అంటే యెందుకో జాలి అనిపిస్తుంది. నా వరకూ కవిత్వం వొక సెల్ఫ్ వామిట్, అదొక సొంత విషయం. అయితే కొన్నిసార్లు రాసినవాడి ఫీల్ చాలామందిలో ఉన్నప్పుడు, రాసిన కాలపు పరిస్థితులే మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యి సార్వజనీనం అవ్వొచ్చు" అని ఈ సంపుటిలో సూఫీ తన భావాలను వ్యక్తపరిచారు.