నర్గెస్ మొహమ్మదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్గెస్ మొహమ్మదీ
స్థానిక పేరుنرگس محمدی
జననం (1972-04-21) 1972 ఏప్రిల్ 21 (వయసు 52)
జంజన్, ఇరాన్
జాతీయతఇరానియన్
ఇతర పేర్లునర్గెస్ సఫీ మొహమ్మదీ
వృత్తిమానవహక్కుల ఉద్యమకారిణి
సంస్థడిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్
నేషనల్ కౌన్సిల్ ఫర్ పీస్
రాజకీయ ఉద్యమంనియో-షరియటిజం[1]
భార్య / భర్త[2]
పిల్లలు2
పురస్కారాలు

నర్గెస్ మొహమ్మదీ ( ఫార్సీ: نرگس محمدی‎ </link> ; జననం 1972 ఏప్రిల్ 21) ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, శాస్త్రవేత్త. నర్గెస్ మరో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత (2003లో) అయిన షిరిన్ ఎబాడి నేతృత్వంలోని డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (డీహెచ్ఆర్ఎస్) సంస్థకి ఉపాధ్యక్షురాలు.[3] ఆమె ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగిన సామూహిక స్త్రీవాద శాసనోల్లంఘన ఉద్యమానికి బహిరంగ మద్దతుదారు.[4] అలానే, 2023లో హిజాబ్‌నీ, పవిత్రతనీ ముడిపెడుతూ ఇరాన్ ప్రభుత్వం చేసిన చట్టాలకు, చేపట్టిన కార్యక్రమానికి గట్టి విమర్శకురాలు.[5] "మరణశిక్ష రద్దు కోసం ప్రచారం చేసే మానవ హక్కుల ఉద్యమాన్ని" స్థాపించి, నడుపుతున్నందుకు 2016 మే నెలలో టెహ్రాన్‌లో ఆమెకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.[6] 2020లో విడుదలైనా 2021లో తిరిగి జైలుకు పంపించారు. ఇరాన్ జైళ్ళలో నిర్బంధిత మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అక్కడి నుంచి నివేదికలు పంపుతోంది.

2023 అక్టోబరులో, జైలులో ఉన్న ఆమెకు 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. "ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి. అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ అందాలని ఆమె చేసిన పోరాటానికి" ఈ బహుమతి ఇస్తున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది.[7][8] ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మొహమ్మదీకి అవార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఖండించింది.[9]

నేపథ్యం[మార్చు]

మొహమ్మదీ 1972 ఏప్రిల్ 21న[10] ఇరాన్‌లోని జంజన్‌లో జన్మించింది. కోర్వే, కరాజ్, ఓష్నవియేల్లో పెరిగింది. [11] ఆమె ఖజ్విన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం పొంది భౌతికశాస్త్రంలో డిగ్రీని అందుకుంది. ఇంజనీర్ వృత్తిని స్వీకరించింది. ఆమె విశ్వవిద్యాలయంలో ఉండగా విద్యార్థుల పత్రికలో మహిళల హక్కులకు మద్దతుగా కథనాలు రాసింది. తషకోల్ దానేష్‌జుయి రోషంగరాన్ ("జ్ఞానోదయ విద్యార్థి సమూహం") అన్న రాజకీయ విద్యార్థి సమూహంలో చురుకుగా ఉండి, వారు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న కారణంగా రెండుసార్లు అరెస్టు చేయబడింది.[10][12] ఆమెకు పర్వతారోహణ అంటే ఇష్టం. పర్వతారోహణ సమూహంలో చురుకుగా ఉండేది, అయితే ఆమె రాజకీయ కార్యకలాపాల కారణంగా పర్వతారోహణల్లో కూడా చేరకుండా నిషేధాజ్ఞలు ఎదుర్కొంది. [10]

మొహమ్మదీ అనేక సంస్కరణవాద వార్తాపత్రికలకు పాత్రికేయురాలిగా పనిచేసింది. ద రిఫార్మ్స్, ద స్ట్రాటజీ అండ్ ద టాక్టిక్స్ అనే పేరుతో రాజకీయ వ్యాసాల సంపుటిని ప్రచురించింది.[12] నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన షిరిన్ ఎబాడి నేతృత్వంలోని డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ (DHRC)లో 2003లో చేరింది;[10] తర్వాతికాలంలో ఆ సంస్థకు ఉపాధ్యక్షురాలైంది. [3]

1999లో ఆమె తనలానే సంస్కరణవాద పాత్రికేయుడైన తాఘీ రహ్మానీని వివాహం చేసుకుంది, ఆ తర్వాత కొద్దికాలానికే తాఘీ అరెస్టు అయ్యాడు.[10][12] 14 ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన తర్వాత విడుదలైన రహ్మానీ 2012లో ఫ్రాన్స్‌కు వెళ్లగా, మొహమ్మదీ మానవహక్కుల రంగంలో తన పనిని కొనసాగించింది [3] మహమ్మదీ, రహమానీ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు.[10][3]

  1. Pourmokhtari Yakhdani, Navid (2018). Iran's Green Movement: A Foucauldian Account of Everyday Resistance, Political Contestation and Social Mobilization in the Post-Revolutionary Period (PDF) (Ph.D.). Edmonton: Department of Political Science, University of Alberta. p. 178. Retrieved 5 June 2021.
  2. Farangis Najibullah (27 February 2008). "Iran: Activist 'Dynamic Duo' Fight for Human Rights". Radio Free Europe/Radio Liberty. Retrieved 10 March 2017.
  3. 3.0 3.1 3.2 3.3 Saeed Kamali Dehghan (26 April 2012). "Iranian human rights activist Narges Mohammadi arrested". The Guardian. Archived from the original on 15 June 2012. Retrieved 31 October 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "G" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "نرگس محمدی: قدرت امتناع زنان، قدرت استبداد را درهم شکسته است – Dw – ۱۴۰۲/۴/۳۱". Deutsche Welle.
  5. "نرگس محمدی: زنان و مبارزه با حجاب اجباری، راهبرد پایان دادن به جمهوری اسلامی هستند". 13 April 2023.
  6. Saeed Kamali Dehghan (24 May 2016). "UN condemns 16-year jail sentence for Iranian activist Narges Mohammadi". The Guardian. Retrieved 11 January 2019.
  7. "Nå blir det klart hvem som får Nobels fredspris 2023". www.aftenposten.no (in నార్వేజియన్ బొక్మాల్). 2023-10-06. Retrieved 2023-10-06.
  8. "'Victory is near': Jailed Iranian activist wins Nobel Peace Prize". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  9. "Spokesman Raps Political Move to Award Nobel Peace Prize to Iranian Convict - Politics news". Tasnim News Agency (in ఇంగ్లీష్). Tehran: tasnimnews.com. Tasnim News. 7 October 2023. Retrieved 7 October 2023.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Muhammad Sahimi (10 May 2012). "Nationalist, Religious, and Resolute: Narges Mohammadi". PBS. Archived from the original on 29 June 2012. Retrieved 31 October 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "PBS" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  11. "Iranian human rights activist Narges Mohammadi gets Nobel Peace Prize". sawtbeirut.com. 6 October 2023. Retrieved 6 October 2023.
  12. 12.0 12.1 12.2 "Narges Mohammadi, from Iran, recepient [sic] of the international Alexander Langer award 2009". Alexander Langer Foundation. 18 June 2009. Archived from the original on 15 June 2012. Retrieved 31 October 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ALF" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు