నర్తనశాల (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్తనశాల విశ్వనాథ సత్యనారాయణ రచించిన నాటకం. మహాభారతంలోని విరాటపర్వంలో కీచకవధను మూల ఇతివృత్తంగా తీసుకుని ఈ నాటకాన్ని రచించారు. ఐతే నాటకం ఆరంభ-అంతాలు, కీచకుని పాత్రను చిత్రీకరించిన విధానం వంటివి నాటకాన్ని మహాభారత గాథ నుంచి విభిన్నంగా నిలిపాయి. కొందరు విమర్శకుల అభిప్రాయం ప్రకారం విశ్వనాథ సత్యనారాయణ మహాభారత ఇతివృత్తాన్ని స్వీకరించి, నాటక శిల్పాన్ని గ్రీకు ట్రాజెడీల శైలిలో నడిపించారు.

ఇతివృత్తం[మార్చు]

పాండవులు, ద్రౌపది మారు వేషాలలో మత్స్యదేశపు రాజు విరటుడి కొలువులో సేవక వృత్తిని అవలంబించటం, రాజశ్యాలకుడైన కీచకుడు ద్రౌపదిని కామించి వేధించటం, రాణి సుధేష్ణ కీచకుడి మాటను కాదనే ధైర్యం లేక సైరంధ్రిని అతని ఇంటికి మదిర తెచ్చే నెపంతో పంపించటం, భీముడు రహస్యంగా అతన్ని మట్టుపెట్టటం, అర్జునుడు బృహన్నల వేషాన్ని వదిలి ఉత్తర గోగ్రహణంలో కురు సేనను ఓడించటం, చివరికి ఉత్తరాభిమన్యుల కల్యాణం.[1]

పాత్ర చిత్రణ[మార్చు]

విరాట పర్వంలో వ్యాసుడు, తిక్కన నిర్వహించిన పాత్రలే అయినా విశ్వనాథ సత్యనారాయణ వాటిని తనదైన శైలిలో పరిపోషించారు. ప్రత్యేకించి కీచకుడి పాత్రలో ఆర్ద్రత, విషాద నాయకత్వం వంటివి ప్రవేశపెట్టారు. ఆయా పాత్రల చిత్రణ ఇలా వుంది:[1]

  • కీచకుడు: తీవ్రమైన ప్రేమికునిలాగా నవలలో కీచకుణ్ణి మలిచారు విశ్వనాథ.
  • ద్రౌపది: ద్రౌపది పాత్రని విరాట పర్వంలో వ్యాసుడు అభిమానవతియైన క్షత్రియకాంతగా, తిక్కన సామాన్య సంసారిగా సృష్టించగా విశ్వనాథ సత్యనారాయణ రాజ్ఞిగా చిత్రీకరించారు. ఆమె పాత్రను లోతు గుండె కలిగిన మహారాణి పాత్రలా తీర్చిదిద్దారు. వ్యాసుని ద్రౌపది అతను సూతడని నిందించగా విశ్వనాథ వారి ద్రౌపది మాత్రం అదేమీ చేయదు, ఎవరైనా ఆమెకు ఒకటే. ఆమెను పాంచాలీ అని సంబోధించగానే అజ్ఞాతవాసం భంగమౌతుందని గుర్తొస్తుంది, అంతటితో అతని మరణాన్ని ఆమె శాసిస్తుంది. ఆమె పాత్ర సంభాషణలు కూడా పరిమితంగానే వుంటాయి. కీచకుణ్ణి నర్తనశాలకు రమ్మని పిలిచేప్పుడు కూడా ఆమె కొద్ది మాటలే పలుకుతుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 అబ్బరాజు, మైథిలి (మార్చి 2014). "నృత్య నాట్య తాండవ వేదిక -నర్తనశాల". వాకిలి. Archived from the original on 14 ఏప్రిల్ 2016. Retrieved 2 April 2016.