నలందా విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నలందా విశ్వవిద్యాలయము
స్థాపితంగుప్త రాజుల ద్వారా 5 వ శతాబ్దంలో
ఛాన్సలర్అమర్త్య సేన్[1][2]
వైస్ ఛాన్సలర్గోపా సబర్వాల్[3]
స్థానంరాజగిర్, నలంద దగ్గర, బీహార్, భారతదేశం
కాంపస్పట్టణ
446 ఎకరాలు (180 హె.)
జాలగూడునలందా విశ్వవిద్యాలయము(official)

నలందా విశ్వవిద్యాలయము అనగా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో నలందకు దగ్గరలో రాజగిరిలో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. ఇది ఆంగ్లంలో నలంద యూనివర్సిటీ గా లేదా యూనివర్సిటీ ఆఫ్ నలంద గా పిలవబడుతుంది. విద్యపరంగా మొదటి సెషన్ సెప్టెంబర్ 1, 2014 న ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించేందుకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల నుండి 1,000 కి పైగా దరఖాస్తులు అందాయి. రెండు పాఠశాలల్లో ప్రారంభంగా ఒక్కొక్క దానికి 20 మంది లెక్కన 40 మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయించారు. కానీ తర్వాత పరిశీలన, ఇంటర్వ్యూలలో 15 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఈ విశ్వవిద్యాలయం పాత నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃస్థాపించే ఉద్దేశముతో పునఃప్రారంభించబడింది. పాత నలందా విశ్వవిద్యాలయం అతి పురాతన అభ్యాస సంస్థలలో ఒకటి. ప్రప్రధమంగా ఈ విశ్వవిద్యాలయం గుప్త రాజుల చేత క్రీ.శ 5 వ శతాబ్దంలో స్థాపించబడింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలనాటి నలందా విశ్వవిద్యాలయంలో 821 సంవత్సరాల తర్వాత సోమవారం తిరిగి తరగతులు ప్రారంభమయ్యాయి! బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రాంగణంలో ఇవి మొదలయ్యాయి. దాదాపు 40 దేశాలకు చెందిన వెయ్యిమందికిపైగా విద్యార్థులు ప్రవేశం కోరినప్పటికీ తొలివిడతగా పర్యావరణ శాస్త్రంపై తరగతులను 11 మంది అధ్యాపకులు, 15మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు ఉప కులపతి గోపా సభర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతానికి ప్రారంభోత్సవాన్ని సాదాసీదాగా జరిపినప్పటికీ ఈ నెల 14న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేతుల మీదుగా భారీఎత్తున నిర్వహిస్తామన్నారు. దశలవారీగా బోధన శాస్త్రాలను, విద్యార్థులు- అధ్యాపకుల సంఖ్యను పెంచుకుంటూ పోతామని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ల చొరవతోపాటు కేంద్ర ప్రభుత్వం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు సమకూర్చే నిధులతో పురాతన నలందా విశ్వవిద్యాలయానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అధునాతన యూనివర్సిటీని 455 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నూతన భవనాలు పూర్తయ్యేవరకు తరగతులను

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 02-09-2014 (821 ఏళ్ల విరామం తర్వాత నలందా విశ్వవిద్యాలయం పునఃప్రారంభం)
  1. "Amartya Sen to be chancellor of Nalanda International University". Daily News and Analysis. 19 July 2012. Retrieved 25 July 2012.
  2. "Amartya Sen named Nalanda University Chancellor". The Times of India. 20 July 2012. Retrieved 25 July 2012.
  3. "DNA special: How PMO shot down Pranab's choice for Nalanda Vice Chancellor". Daily News and Analysis. Retrieved 6 May 2012.