నలపట్ బాలమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలమణి అమ్మ
పుట్టిన తేదీ, స్థలం(1909-07-19)1909 జూలై 19
పున్నయూర్కులం, పొన్నాని తాలూకా, మలబార్ జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2004 సెప్టెంబరు 29(2004-09-29) (వయసు 95)
కొచ్చి, కేరళ, భారతదేశం
వృత్తికవయిత్రి
రచనా రంగంకవిత్వం
పురస్కారాలుపద్మ భూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్, ఆసన్ ప్రైజ్, ఎజుతాచన్ అవార్డు
జీవిత భాగస్వామివి.ఎం. నాయర్‌
సంతానంకమలా సూరయ్య, సులోచన, మోహన్‌దాస్, శ్యామ్ సుందర్

నలపట్ బాలమణి అమ్మ ( 1909 జూలై 19 - 2004 సెప్టెంబరు 29) మలయాళ భాషకు చెందిన భారతీయ కవయిత్రి, ఈమె ప్రసిద్ధ రచనలు అమ్మ, ముతాస్సీ,, మజువిన్తే కథ. బాలమణి పద్మ భూషణ్, సరస్వతి సమ్మన్, సాహిత్య అకాడమీ అవార్డు ఎజుతాచన్ అవార్డులతో సహా పలు అవార్డులు, గౌరవాలు అందుకుంది.

జీవిత చరిత్ర[మార్చు]

బాలమణియమ్మ, 1909 జూలై 19న కేరళలోని త్రిస్సూర్ జిల్లా నలపట్ గ్రామంలో చితంజూర్ కోవిలకట్‌లో కుంజున్నిరాజా, నలపట్ కచ్చుకుట్టియమ్మ దంపతులకు కుమార్తెగా జన్మించింది. ఎటువంటి అధికారిక విద్యను పొందనప్పటికీ, ఆమె తన మామ ఇంకా కవి అయిన నలపట్ నారాయణ్ మీనన్ చేత ప్రభావితమైంది, అతని పుస్తకాల సేకరణ కవయిత్రి కావడానికి సహాయపడింనది. 19 సంవత్సరాల వయస్సులో బాలమణి అమ్మకు వి.ఎం. నాయర్‌తో వివాహమైంది.వాహనంతరం తన భర్తతో కలిసి జీవించడానికి కోల్‌కతాకు వెళ్లిపోయింది. భర్త నాయర్ 1977లో మరణించారు. తన భర్త మరణించినప్పటి నుండి, ఆమె తన పిల్లలు శ్యామ్ సుందర్ (కొడుకు), సులోచన (కుమార్తె) తో కలిసి కొచ్చిలో నివసిస్తూ అల్జీమర్స్ వ్యాధితో బాదపడుతూ, 95 సంవత్సరాల వయస్సులో 2004 సెప్టెంబరు 29న బాలమణి అమ్మ మరణించింది.పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి[1].

రచనలు[మార్చు]

మలయాళంలోని మహాకవి వి నారాయణ మీనన్ శైలి, సృజనాత్మకతకు ఆమె ఎంతగానో ఆకట్టుకుంది, అతను అమ్మకు ఇష్టమైన కవి అయ్యాడు. ఆంగ్ల భాషా భారతీయ రచయిత్రి కమలా దాస్ అతని కుమార్తె, 1930లో ఆమె మొదటి కవిత కూప్పుకై అనే శీర్షికతో ప్రచురించబడింది. 1929-39 మధ్య కాలంలో రాసిన కవితల్లో దేశభక్తి, గాంధీ ప్రభావం, స్వాతంత్ర్య కాంక్ష స్పష్టంగా కనిపిస్తుంది బాలమణి అమ్మ 20కి పైగా కవితా సంకలనాలు, అనేక గద్య రచనలు, అనువాదాలను ప్రచురించింది.[2] చిన్నవయసులోనే పద్యాలు రాయడం పట్ల ఆసక్తి కనబరిచిన అతను మొదటి కవిత "కూప్పుకై" 1930లో ప్రచురించింది.1947లో కొచ్చి మహారాజా పరీక్షిత్తు తంపురాన్ నుంచి 'సాహిత్యనిపుణ' పురస్కారాన్ని అందుకున్నారు. 1987లో ప్రచురించబడిన "నివేద్యం" కవితా సంపుటి. కవి ఎన్.ఎన్.మీనన్ మరణంపై "లోకంతరంగిళీ" పేరుతో సంకలనంగా తెచ్చినది, 'పిచ్చుక' పేరుతో రాసిన తొలి కవిత ఒకటి ఆ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది కేరళ రాష్ట్ర పాఠ్యపుస్తకాలలో చేర్చబడింది తర్వాత ఆమెకు ఎన్నో అవార్డులు, సన్మానాలు వచ్చాయి. బాలమణియమ్మ పద్యాలు మనిషి మనసులోని లోతును సరళంగా, ఉల్లాసంగా ఉండే శైలిలో ప్రతిబింబిస్తాయి. వారిలో మాతృత్వం, అమాయకపు పసితనం ఎక్కువగా ఉండేవి. బాలామణి అమ్మ రచనలలో ప్రధాన అంశం మాతృప్రేమ ఇందువలన ఆమె మాతృత్వపు కవయిత్రిగా ప్రసిద్ధి.ఆమె కవిత్వం ఆమెకు మలయాళ కవిత్వంలో అమ్మ (తల్లి), ముత్తస్సి (అమ్మమ్మ) బిరుదులను సంపాదించిపెట్టింది. 1987లో భారతదేశం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ గ్రహీత కూడా. గూగుల్ సెర్చ్, బాలమణి అమ్మ 113వ జయంతిని డూడుల్ గా గౌరవించింది[3].ఆంగ్ల భాషా భారతీయ రచయిత్రి కమలా దాస్ ఈమె కుమార్తె.

అవార్డులు[మార్చు]

కేరళ లిటరరీ ఫోరమ్ అవార్డు (1964) - (ముట్టాచి సేకరణకు) లిటరరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డ్ (1965) - (ముత్తాచి సేకరణకు) పద్మ భూషణ్ (1987) ఆసన్ అవార్డు (1991) వల్లతోల్ అవార్డు (1993)

మూలాలు[మార్చు]

  1. aditi.thakur. "Who was Balamani Amma, the poet honoured by Google Doodle?". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2022-07-19.
  2. "Books by Balamani Amma (Author of Mathruhridayam)". www.goodreads.com. Retrieved 2022-07-19.
  3. "Balamani Amma: Google Doodle celebrates Malayalam poet's 113th birth anniversary". The Indian Express (in ఇంగ్లీష్). 2022-07-19. Retrieved 2022-07-19.