నల్గొండ జిల్లా పుణ్యక్షేత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • ఆలేరు మండలంలో నున్న పుణ్య క్షేత్రములు:

ఆలేరు: హైదరాబాదు-- వరంగల్లు రోడ్డులో 44 కిలో మీటర్ల దూరంలో ఆలేరు గ్రామంన్నది. ఆలేరు నదీ తీరంలో శ్రీరామ, శ్రీరంగనాయక, శివాలయములున్నవి. శ్రీరామాలయం సాయి గూడకు దగ్గరలో ఉంది. ఇక్కడ పది అడుగులు వ్వాసంగల గుండ కలది. ఇటువంటి గుండ్రటి గుండం ఇదొక్కటే. మరెక్కడా లేదు.

కొలనుపాక జైనమందిర గోపురం

ఈ గ్రామం చాల చరిత్రాత్మక ప్రదేశము, సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి ) లింగము నూట ఓక్క చెరువు - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ సొమేశ్వర స్వామిగా అవతరించాడు, వీరనారాయణ స్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము, రేణుకా చార్యుని జన్మ స్తలము, వివిధ కులాలకు చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది.

సా.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.

సా.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్‌చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.

మధ్య యుగం - సా.శ. 1008 - 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు సా.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలన లోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నాయి. మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము. ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది. ఇది నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడి యున్నది. 38.5 అంగుళాల వెడల్పు, 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విగ్రహం. విగ్రహం ఆహార్యము బహు గొప్పగా మలచబడింది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం, చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.

భగవాన్ మహావీర్

ఈ విగ్రహం మూల విరాట్టుకు కుడి వైపున గల గర్భ గుడిలో ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం, అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉంది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉంది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారతదేశంలో మరెక్కడా లేదు.

ఆలయ ప్రవేశ ద్వారం చూస్తే కోట ద్వారాన్ని తలపిస్తుంది. అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మ చిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

కొలనుపాక వస్తు ప్రదర్శనశాలలో జైనుల, వీరశైవుల చరిత్రను చెప్పే అనేక బొమ్మలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. వీర శైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యుల వారు లింగంలోనుంచి ఉద్భవించిన ప్రదేశం కూడా కొలనుపాకే అని భావిస్తున్నారు. సోమేశ్వరాలయంగా చెప్పే ఈ ఆలయంలో రేణుకాచార్యుల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. ఆలయంలో ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటిచెప్పే శిల్పసంపదను చూడవచ్చు. అయితే ప్రస్తుతం అవన్నీ నిరాదరణకు గురై ఉన్నాయి.

ఈ గ్రామంన అనేక శిథిల దేవాలయ చిహ్నములు కనబడు చున్నవి. శివ లింగములు, పానవట్టములు, భైరవ స్వామి విగ్రహాలు మొదలగుంవి ఎక్కువగా కనబడుచున్నవి. కొలను పాక నుండి సిద్ది పేటకు వెళ్లు దారిలో ఇరుప్రక్కల పాచీన నగర శిథిలములు, పట్టణ సింహ ద్వారము కనుపించు చున్నవి.

  • యాదగిరి గుట్ట

ఇది తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్య క్షేత్రము. ఇక్కడ వెలసిన దేవుడు యాదగిరి నరసింహ స్వామి. ఇది హైదరాబాదు--వరంగల్లు రహదారిలో భువనగిరికి సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర:

  • సురేంద్ర పురి.

ఇది యాదగిరి గుట్టకు అతి సమీపంలో ఉంది. ఇది నూతనముగా నిర్మిచిన క్షేత్రము. ఇక్కడి కళాధామం చూడవలసినదేగాని, చెప్పనలవికాదు. ఈ కళాధామం దర్శించుటకు 250/- (2010 డిసెంబరు నాటి రేటు) ప్రవేశరుసుము చెల్లించవలెను. ఈ కళాధామం దర్శించుటకు రెండుగంటల సమయం పడుతుంది. లోపలకు కెమేరాలను అనుమతించరు. అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామానికి ప్రవేశమార్గం ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో సకల దేవతల దర్శన భాగ్యం కలిగించడము ఇక్కడి విశేషము.

  • నాగ కోటీశ్వరాలయం

ఇది యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట సమీపంలోని సురేంద్రపురికి అనుబంధంగా ఉంది. యాదగిరి గుట్ట:, నల్గొండ జిల్లా: నాగాభరణంలో వున్న కోటి శివలింగ ప్రతిమల్ని ఒకే చోట దర్శించు కుంటే నాగ దోషం పోతుందంటారు. అటు వంటి అవకాసాన్ని కలిగించేదే ఈ ఆలయం: ఇందులో కోటి పార్టీవ లింగాలను నాగ ప్రతిమతో సహా చేసి ప్రతిష్ఠించారు. పుట్ట మట్టితో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నందున దీనికి నాగ కోటి ఆలయమని పేరు పెట్టారు. నాగ దోష నివారణకు భక్తులు ఇటు ఛిత్తూరు జిల్లలోని శ్రీ కాళహస్తికి గాని, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ గాని వెళ్లవలసి వచ్చేది. ఇది చాల ప్రయాసతో కూడు కున్న పని. హైదరాబాదుకు దగ్గర్లో అలాంటి ఆలయం వుంటే భక్తులకు సౌకర్యంగా వుంటుందని బావించారు దివ్యజ్ఞాన సిద్దాంతి. వారి సంకల్పమే ఈ ఆలయం. ఆలయ నిర్మాణానికి సిద్దాంతి గారు ఒక ఆలోచన చేశారు. దాని ప్రకారం కాల సర్ప దోషం వున్న వారు నలబై రోజులు దీక్ష చేపట్టి ఒక్కో భక్తుడు పుట్ట మట్టితో చేసిన 108 సర్ప లింగాల్నితీసుక రావాలని నియమం పెట్టారు. పార్థివ నామ సవత్సరం శ్రావన శుద్ధ పంచమి నాగ పంచమి నాడే ఆలయ శానికి స్థాపన జరిగింది. ఆ విధంగా నాగ లింగ ప్రతిమల ప్రతిష్ఠాపన మహోత్సవం అక్టోబరు 31 ....2009 జరిగింది. ఈ ఆలయం పెద్ద కొండపై ఏర్పాటు చేశారు. పానవట్టంతో ఉన్న శివ లింగం పై అయిదు పడగలు గల నాగాభరణం ఉన్నట్లు నిర్మించిన ఈ ఆలయం ఎత్తు 101 అడుగులు., ఈ శివ లింగాకారం లోపల సెమెంటుతో చేసిన దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాటి చుట్టు తిరిగితే నాగ కోటి శివలింగాలకూ ప్రదక్షిణ అవుతుంది. అలా సర్ప సహితంగా ఉన్న కోటి లింగాల దర్శనము ప్రదక్షిణ మూ జరుగు తాయన్నమాట. హైదరాబాదు నుంచి నాగ కోటీశ్వరాలయం కేవలం 55 కిలో మీటర్లు మాత్రమే.

  • గొలను గొండ.

ఆలేరు వాగు తీరమున వున్నది ఈ కొండ. ఇది ఏక శిలా పర్వతము. కొండ పైన ఆంజనేస్వామి ఆలయం ఉంది.

  • భువన గిరి కోట

భువనగిరి ఒక ముఖ్య పటణం.భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఈ కోట అనేక బురుజులతో రాజ ప్రసాధములతో శత్రుదుర్బేద్యముగా నున్నది. కొండ పైన గిర్ గిర్ మహాల్ ఉంది. బహమని, కుతుబ్ షాల కాలంనాటి పిరంగులు కూడా ఉన్నాయి.

  • మహాదేవ పురము.

కొండ మడుగు గ్రామంనకు రెండు కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం వెలుపల బృహద్దేవాలయములున్నవి. ఆలయ శిఖరములు ఇటుక సున్నంతో నిర్మించ బడినవి. ఆలయమునకు గర్భ గుడి, అంతరాళము, ముఖ మంటపము, ముఖమండపంలోనే రంగ మండపము నిర్మించ బడినవి. ఆంత రాళ మంటపమున ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయానికి అతి సమీపంలోనే మరో శిథిల ఆంజనేయ స్వామి ఆలయము ఉంది. వీటిని అక్కన్న మాదన్న దేవాలయములని స్థానికులు పిలుస్తారు.

  • ఇంద్ర పాల నగరం.

పూర్వం ఇది ఇంద్ర పురిగా పిలువ బడింది. ఇంద్ర పురిని రాజదానిగా చేసుకొని విష్ణు కుందినులు పాలన సాగించారు. ఇంద్ర పురి దుర్గము ఒక విశాలమైన కొండ పై నిర్మించ బడింది. ఇచట అమరేశ్వారాలయమున్నది. అక్కడక్కడా శిథిలాలయాలు కనబడు చున్నవి. ఇచట రాష్ట్ర కూటులకు చెందిన శాసనములు ఉన్నాయి.

  • వలిగొండ.

ఇది రామన్న పేటకు 13 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్వం ఇంద్ర పురిలో భాగమె. ఇచట అష్ట దిక్కులందు ఆంజనేయ స్వామి ఆలయములు ఉన్నాయి. శిథిలమైన పురాతనమైన కోట, కొండ పై శివాలయమున్నది. ఇచట క్రీ.పూ.2500 నాటి సమాధులున్నవి. నదిలో ఒకచోట ఒక బండపై 101 శివలింగములు చెక్కబడినవి. అచటనే గంగా దేవి విగ్రహం ఉంది. కాకతీయుల నాటి శాసనములు కూడా ఉన్నాయి.

  • నాగారం.

తుమ్మల గూడెం - వలిగొండ గ్రామాల మద్య నున్న మూసీ నది తీరమున నాగారం గ్రామంన్నది. ఇది కూడా అలనాటి ఇంద్రపురిలో భాగమె. ఇచ్చట తాంర శాసనములు లభించినవి. ఈ ప్రాంతమున అనేక చైత్యములు, విహారములు, బౌద్ధారామములు, స్థూపములు వెలసినవి.వాటికి సంబంధించిన అనేక శిథిలములు కనబడు తున్నవి. గ్రామంనకు పడమరన అతి ప్రాచీనమైన శివాలయమున్నది. కొండ చుట్టు ప్రక్కల అనేక శిథిలాలయములున్నవి. ఇక్కడ అనే పురాతన నాణేలు ఇతర చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన చాల వస్తువులు లభించాయి.

  • వేముల కొండ:

ఈ గ్రామ పరిదిలో ఒక గుట్టపై నరసింహ స్వామి దేవాలయమున్నది. అదే ప్రాంతంలో రెందు గుట్టల మద్య శిచిలమైన కోట ఉంది. ఇది మహామ్మదీయ పాలకులకు పక్కలో బల్లెముగా పేరు గాంచిన సర్వాయి పాపన్న కోట. సర్వాయి పాపన్న క్రిష్ట జిల్లా జగ్గయ పేట ప్రాంతం వాడు. ఇతడు సమీప గ్రామాలను దోచి విపరీతమైన ధనమును సంపాదించి సైన్యమును సమకూర్చుకొని బలిష్టమైన కోటను నిర్మించెను. అంతే గాక జనగాం తాలుకలోని ఖిలాషాపూర్ గ్రామంన మరొక దుర్గమును నిర్మించెను. తాను దోచిన ధనమును బీదలకు పంచి పెట్టే వాడని పేరు. అతని అకృత్యములు మితి మీరి పోగా అనేకమంది అతనిని చుట్టు ముట్టి బంధించి చంపేశారు. వేముల కొండ కోట శిథిలాలలో నేటికి గుప్త ధనము కొరకు వెతుకులాట కొనసగు తున్నది.

  • బూరుగు గడ్డ.

ఈ గ్రామం హుజూరు నగర్ కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇచ్చట శివాలయము, చెన్న గోపీనాధ దేవాలయములున్నవి. ఈ దేవాలయములందు ఐదు శిలా శాసనములున్నవి. ఇవి కళ్యాణి చాళుఖ్య త్రిభువన మల్ల ఆరవ విక్రమాధిత్యుని మహాప్రదానియు, దండ నాయకుడును, వేంగి 12000 లతో పాటు మరియొక విషయమును పాలించు వాడను నగు అనంత పాలయ్య వేంచిన శాసనము కన్నడ భాషలో ఉంది. రెండో శాసనము తెలుగులో ఉంది. ఇది కాకతి రుద్రమదేవి ప్రధాని సత్రము బొల్లను రాజు సోధరుడగు దేవకి పుత్రదాసు సా.శ. 1268 లో చెన్న గోపీనాధ విగ్రప్రతిష్ఠ చేసి భూములు దానమిచ్చినట్లున్నది. మూడవ శాసనము చిలుకూరి అలభీమనాయని కొడుకు అనంతమ నాయుడు తన తండ్రికి పుణ్యార్థముగా కామేశ్వర దేవరను ప్రతిష్ఠించి భూమి దాన మిచ్చి నట్లు వేయించ బడింది. చెన్న గోపీనాధ దేవునికి చింతా మణి పెట్టిన వృత్తులను తెలుపు శాసనము . నాల్గవది, ఐదవ శాసనము విష్ణు వర్థన చక్రవర్థ్లైన అమ్మజియగణ పద్దేవందు గోపీనాధ స్వామికి భూధాన మొసంగి నట్లున్నది.

  • భేతవోలు.

ఈ గ్రామంన అతి పురాతనమైన వేణు గోపాల స్వామి ఆలయము ఉంది. దీనికి గర్భగుడి, అంత రాళము ఉన్నాయి. ఇక్కడ నిత్య పూజా కార్యక్రమములు గరుగు చున్నవి. చిలుకూరు నుండి బేతవోలుకు రోడ్డు మర్గమున్నది.

  • మునగాల.

ఇది తొమ్మొదో నెంబరు జాతీయ రహదారి పైనున్న పురాతన గ్రామం. ఇది మునగాల పరగణగా పిలువబడు జమీందారి కేంద్ర స్థానము. నడి గూడెము మునగాల జమీందారు శ్రీ రాజా నాయని వేంకట రంగా రావు బహద్దరు కొమట్టా లక్ష్మణ రావు వీరి దివాను. హైదరాబాదు - సుల్తాను బజారులో వున్న శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమును స్థాపించుటకు మునగాల జమీందారు చాల కృషి చేసిరి. తాడు వాయి గ్రామంమున చెన్న మల్లికార్జునుని మహా లింగమున్నది. ఈ ఆలయము ముందుండిన శిలా శాసనములను శ్రీ వేంకట రంగా రావు గారు తరలించి తమ కోటలో భద్ర పరిచి నారు. ఈ శాసనములు కాకతీయ సామంతులైన చెరకు వంశీయులవి.

  • సోమ వరము.

ఇది కూడా అతి ప్రాచీన గ్రామం. ఇక్కడ స్వయంభూ సోమేశ్వరాలయమున్నది. ఆలయము లోపల, కుడ్యములపై ఆరు శిలా శాసనములున్నవి. ఈ దేవాలయములో చక్కని శిల్పకళ ఉంది. శివ రాత్రికి ఉత్సవములు జరుగును. సా.శ. 1213 లో రేచెర్ల బేతి రెడ్డి, గెచ్చి బొల్లి నాయకులు కలిసి బిక్కి మల్లేశ్వరమందు, సోమేశ్వర దేవరకు భూమి ధాన మిచ్చు సందస్ర్బమున నొక శాసనము వేయించిరి. ఇంకొక శాసనము 1214 లో ప్రొలే దేవరిరట్ల కొడుకులు కొండెనప్పన, రామేశ్వర మండపములకు దాన మిచ్చిన సందర్భంగా వేయించింది.

  • జాన్ పాడు.

నేరేది చెర్ల—దర్శిన చెర్ల రహదారిలో జాన్ పాడు గ్రామం ఉంది. ఇక్కడ జాన్ పాడు సైదులు పేరున ఒక ధర్గా ఉంది. ఇది చాల మహాత్తు కలది యని ప్రాంతీయుల్ నమ్మకము. అన్ని మతాల వారు ఈ ధర్గాను దర్శింతులు.

  • మట్ట పల్లి:

ఇచ్చటి మట్ట పల్లి నారసింహ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. ఇది పంచ నారసింహ క్షేత్రాలలో రెండవది. స్వామి మహాత్తు గలవాడని జనవాక్కు. అనేక జిల్లాల నుండి భక్తులు వచ్చు చుందురు. స్వామి వారికి నిత్యారధన జరుగు చున్నది. యాత్రికులులకు సౌకర్యార్థము సత్రములున్నవు. నల్గొండ జిల్లాలోని ఐదు నరసింహ క్షేత్రాలలో, వాడ పల్లి, మట్టపల్లి, కృష్ణా నది తీరమందుండగా మిగతా మూ క్షేత్రాలు యాదగిరి గుట్ట, వేముల కొండ అరువ పల్లి నరసింహాల గూడెము లందున్నవి.

  • వాడపల్లి

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూక, దామరచర్ల మండలంలో వున్నదీ వాడపల్లి క్షేత్రం . ఇక్కడ కృష్ణా ముచికుందా (మూసీ) నదీ సంగమతీరాన హరిహరులకు భేదంలేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి వున్నారు . నల్గొండ అద్దంకి హై వేలో భీమవరం గుండా వాడపల్లికి చేరుకోవచ్చు.. ఈ రోడ్డులో వున్న ఇండియా సిమెంట్స్ కి ఎదురుగా వచ్చే రోడ్ లోకి తిరిగి అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క వచ్చే మట్టి రోడ్డులో వెళ్తే ఈ ఆలయం వస్తుంది. పూర్వము తీరప్రాంతములో పడవలు నడుపు పల్లెకారులు కట్టుకున్న పల్లె వాడపల్లె కాలక్రమానా వాడపల్లిగా మారింది. 6000 సంవత్సరాలక్రితం అగస్త్య మహాముని తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ కృష్ణా, ముచికుందా నదీ సంగమంలో స్నానంచేసి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడిన లింగంగనుక అగస్త్యేశ్వరుడయ్యాడు. శివ కేశవులకు భేదములేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. తర్వాత కొంతకాలానికి రక్షణలేని కారణంగా విగ్రహాలచుట్టూ పుట్టలు లేచాయి. రెడ్డిరాజులకాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపుల నీరు, ఒక వైపే త్రోవ వున్నదని గుర్తించి, ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా వుంటాయనే వుద్దేశ్యంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి, గుడి కట్టించి పూజించసాగారు. రెడ్డి రాజులిక్కడ కోటలు, ఊళ్ళూ నిర్మించుకుని చాలాకాలం పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిధ్ధ పట్టణంగా పేరుపొందిన ఈ పట్టణాన్ని అగస్త్యపురము, నర్సింహాపురం, వీరభద్రపురం అను పేర్లతో పిలిచేవారు. 11వందల సంవత్సరాలు సురక్షితంగా వున్న ఈ పట్టణం నిజాం మేనల్లుడయిన వజీరు సుల్తాను ముట్టడిలో సర్వనాశనమైంది. వజీరు సుల్తాను గుళ్ళని మాత్రం ఏమీ చేయలేదు. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి దక్షిణ ముఖంగా వున్న ఈ ఆలయం చిన్నదయినా స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భ గుడిలో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది. ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు. ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట. ఈ ఆలయం ఎదురుగా వున్న దోవలో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది. మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి: ఈ ఆలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు ఉంది. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది. ఈ లింగము మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు వూరుతూవుంటుంది. నీటిమట్టానికి అంత ఎత్తునవున్న లింగం పైనుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులోవున్నదో ఎవరికీ తెలియదు. దానికి సంబంధించిన ఒక కథమాత్రం ప్రచారంలో ఉంది. క్షేత్ర పురాణం ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు శివ లింగం పైన ఇప్పటికీ కనబడుతాయి. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట. సా.శ. 1524 సం.లో శ్రీ శంకరాచార్యులవారు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారుట. ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక ఉధ్ధరిణకి తాడు కట్టి ఆ బిలంలో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకుని, పూజలు జరిపి వెళ్ళారుట. ఈ విషయంలో శ్రీ శంకరాచార్యులవారు రాయించిన శాసనం (పాళీ భాషలో) దేవాలయంలో ఇప్పటికీ ఉంది. నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం చెయ్యటం, కర్మకాండలు కూడా చేస్తుంటారు. రెండు నదుల సంగమంలో వున్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాదునుంచీ బస్సులున్నాయి. పిడుగురాళ్ళ వెళ్ళే బస్సులు వాడపల్లి మీదనుంచే వెళ్తాయి. రైలు మార్గం మిర్యాలగూడా వరకే. అక్కడనుంచీ బస్ లో వెళ్ళాలి. ఇక్కడ వసతికీ, భోజనానికి సౌకర్యాలు లేవు. ఒక పెద్ద హాల్ వుంది కాని దానిలో వేరే ఏర్పాట్లేమీ లేవు. వుండటం కొంచెం కష్టమే.

  • నార్కట్ పల్లి.

ఈ గ్రామంన ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయమున్నది. నార్కట్ పల్లికి చేరువలో అతి పురాతనమైన కైరనులు ఉన్నాయి. (సమాధులు) ఈ సమాధులు కొత్తరాతి యుగపు సమాజమునకు సంబంధించినవి. వీటిని దాల్మెన్ సమాధులని కూద అంటారు. వీటిలో ఆనాటి మానవులు వాడిన వస్తువులు, రాతి పనిముట్లు మొదలగునవి లభించినవి.

  • రాచ కొండ.

అన పోతనేడు రాచ కొండ ధుర్గమును నిర్మించి రాజదానిగా చేసుకొని పరి పాలించాడు. నారాయణ పురం నుండి గాని, ఇబ్రహీం పట్నం తాలూక లోని జాపాల నుండి గాని రాచ కొండకు చేర వచ్చును. ఇక్కడ పర్వత శ్రేణి రెండుగా చీలిన ప్రాంతములో ఒక కోట ఉంది. దీని పై కెక్కుటకు సోపాన మార్గమున్నది. కొండను చేరడానికి నాలుగు ద్వారములు దాటవలెను. ఈ ద్వారములు అతి పెద్ద శిలలచే నిర్మించ బడినవి. రెండు ద్వారములు ఒక చోట ఉన్నాయి. వీటిని జంట వాకిళ్లు అంటారు. లోపల నాలుగు మంటపములున్నవి. ఇచట కొండ బీటలు వారి ఉంది. అది ఒక కొలనుగా ఏర్పడినది. అందు స్వస్చమైన నీరున్నది. నాగ నాయుని కొండపై రోళ్లు మొదలగు రాతి పరికరములు గలవు. ఇచట వున్న రెండు పెద్ద బండ రాళ్ల మద్యలోనున్న చిన్న రంద్రంలో నుండి చూస్తే లోన శిలా విగ్రహములు కనిపించును. ఈ దుర్గము క్రింద పూజాదికాలు జరుగు రామాలయమున్నది. ఈ ప్రాంతమున జన వాసములు లేవు. ప్రతి శని వారము ఒకరు వచ్చి పూజలు చేసి వెళ్లు చుందురు.

  • చందూరు.

ఈ గ్రామంన అతి పురాతనమైన మార్కొండేశ్వరాలయమున్నది. ఇచట పద్మ శాలీలు ఎక్కువ. వారు బట్టలను నేసి ఎగుమతి చేయుదురు. ఇత్తడి పాత్రల తయారికి కూడా ఈ గ్రామం ప్రసిద్ధి.

  • పానగల్లు

ప్రాచీనాంద్ర మహా నగరంలలో పానగల్లు ఒకటి. కళ్యాణ చాళుఖ్యు కాకతీయ కందూరి చోళ్ పద్మనాయక గోల్కొండ, అసప్ జాహి వంశీయుల కాలములో ఈ నగరం బహు ప్రఖ్యతి గాంచి యుండెను. కాని ఇప్పుడు పూర్వ వైభవము లేదు. ఇక్కడున్న పచ్చల సోమేశ్స్వరాలయము, చెన్న కేశవాలయములలో వున్న శిల్ప కళక వుగ్రహములు అత్యంత మనోహరముగా ఉంది. ప్రస్తుతం పానగల్లు ఇంచు మించు నల్గొండ పట్టణంలో కలిసి పోయి ఉంది.

  • రామ లింగాల గూడెం.

నల్గొండ.... తిప్పర్తి రోడ్డులో నల్గొండ నుండి పన్నెండు కిలో మీటర్ల దూరంలో వున్న ఈ గ్రామం ఉంది. గ్రామ సమీపాన విశాలమైన ప్రాంతమున మార్కొండేశ్వరాలమున్నది. ఇది పురాతనమైనది. గుట్టపై అమ్మవారి అలయమున్నది. ఈ ఆలయమున ప్రతి శివ రాత్రికి పెద్ద ఉత్సవము జరుగును. ఈ చుట్టు ప్రక్కలందు వీర గల్లుల శిలలు, పార్వతీ పస్రమేశ్వరుల శివలింగములు, గణపతి విగ్రహములు కనిపించును.

నల్గొండ జిల్లాలో పైనుదహరించిన ప్రదేశములే గాక అనేక మైన గ్రామాలలో దేవాలయాలు, చిన్న కోటలు, చారిత్రిక ప్రదేశాలు ఉన్నాయి. మొత్తంగా పరిశీలించి చూస్తే .... ఈ జిల్లా మొత్తం అత్యంత చారిత్రిక ప్రాముఖ్యత గాంచిన ప్రాంతంగా వర్తిల్లినదని తెలుస్తున్నది. అధికంగా కనబడే పురాతన పట్టణాల శిథిలాలు, కోటలు, దేవాలయాలు, శిల్పాలు, మొదలగునవే అందుకు తార్కాణము. అంతే గాక ఈ ప్రాంతమున కనబడు కొత్త రాతి యుగానికి చెందిన సమాధులను బట్టి ఈ ప్రాంతము చరిత్రకు ముందు నుండి కూడా మానవు నివాసముండెనని తెలియు చున్నది. చారిత్రిక పరిశోధకులకు ఈ నల్గొండ జిల్లా ప్రాంతము చక్కని పరిశోధనాశం. మూలం:: నల్గొండ మండల సర్వస్వము. రచన బి.ఎన్.శాస్త్రి.