Jump to content

నల్లా వజ్రమ్మ

వికీపీడియా నుండి
నల్లా వజ్రమ్మ
జననం
వజ్రమ్మ

మరణం2017, మే 26
వృత్తిచేనేత కార్మికురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణా పోరాట యోధురాలు
జీవిత భాగస్వామినల్లా నరసింహులు
పిల్లలుముగ్గురు కుమార్తెలు (అరుణ)

నల్లా వజ్రమ్మ, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారిణి. 'తెలంగాణ  టైగర్', ‘జనగామ సింహం’గా అని పిలువబడ్డ తన భర్త నల్లా నరసింహులుతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో, గెరిల్లా పోరాటంలో పాల్గొన్నది.[1]

జననం, విద్య

[మార్చు]

వజ్రమ్మ తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండిలో జన్మించింది. మూడో తరగతి వరకు చదువుకున్నది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వజ్రమ్మకు 9 ఎళ్ళ వయసులో అదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ నల్లా నరసింహులుతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు.

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

విసునూరు దేశముఖ్ రేపాక వెంకట రామచంద్రారెడ్డి, అతని తల్లి  జానమ్మల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన తన భర్త నరసింహులుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో వజ్రమ్మ కూడా పోరాటంలో పాల్గొన్నది.[2] జైలు నుండి భర్త తప్పించుకోవడంలో వజ్రమ్మ పాత్ర ఉన్నదని భావించిన పోలీసులు 1952లో నిండు గర్భిణిగా ఉన్న వజ్రమ్మను, నిర్బంధించి జైలులో పెట్టారు. 25 రోజు జైలు జీవితం గడిపి జైలులోనే పెద్ద కుమార్తె (అరుణ) జన్మనిచ్చింది.

జనగామ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కడవెండి నాయకుడు ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డిని అరెస్టు చేయించినప్పుడు ఆయనను విడిపించడం కోసం కడవెండి గ్రామంలోని నల్లా వజ్రమ్మ, ఎన్నమ్మ, గోపమ్మ, శేరమ్మ, సుశీల మొదలైన మహిళలతో తొలి మహిళా దళం ఏర్పాటయింది. ఈ దళం రాళ్ళతో దాడి చేసి తమ నాయకుడిని విడిపించుకుంది. అంతేకాకుండా పలు సందర్భాలాలో నిజాం సైన్యాన్ని నిలువరించి గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంది.[3]

మరణం

[మార్చు]

తెంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీరవనితగా పేరొందిన వజ్రమ్మ తన 95 ఏట అనారోగ్యంతో 2017, మే 26న జనగాంలోని కూర్మవాడలో మరణించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "విప్లవసింహం.. నల్లా నరిసింహం | వేదిక | www.NavaTelangana.com". NavaTelangana. 2018-03-18. Archived from the original on 2022-10-17. Retrieved 2022-10-17.
  2. RJ (2022-10-03). "విప్లవ సింహం నల్లా నరసింహులు". Suryaa.co.in. Archived from the original on 2022-10-03. Retrieved 2022-10-17.
  3. "వీరవనితల పునీత తెలంగాణ". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-09-26. Archived from the original on 2021-09-27. Retrieved 2022-10-17.
  4. "అస్తమించిన కడవెండి వజ్రం". www.telugu.oneindia.com. 2017-05-29. Archived from the original on 2017-05-29. Retrieved 2022-10-17.