నవ్యాంధ్రము నా జీవిత కథ
నవ్యాంధ్రము నా జీవిత కథ | |
కృతికర్త: | అయ్యదేవర కాళేశ్వరరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జీవిత చరిత్ర |
ప్రచురణ: | ఎమ్మెస్కో ప్రచురణలు |
విడుదల: | జనవరి 8, 2006 |
పేజీలు: | 482 |
నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రథమ సభాపతి, విశాలాంధ్రావతరణ ముఖ్య కారకులైన అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వీయచరిత్ర.[1][2][3]
పుస్తకం గురించి
[మార్చు]ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలాలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకం మొదటి సంపుటాన్ని రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు 1959 ఉగాదికి ఆంధ్రప్రజలకు అంకితమిస్తూ విడుదల చేసారు. రచయిత జీవితకాలము ఆంధ్రదేశములో జరిగిన మత-సాంఘిక-రాజకీయ-ఆర్ధిక విప్లవములకు సాక్ష్యము. అవన్నీ ఈ పుస్తకములో చేర్చినట్టుగా రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. ప్రస్తుత పుస్తక సంపాదకులుగా డా॥డి. చంద్రశేఖర రెడ్డి, పుస్తక ఆకృతీకరణకు పురుషోత్త్ కుమార్ పనిచేసారని పుస్తక మనవి మాటలలో తెలుగు సమితి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.[4]
పుస్తకం పేరు గురించి
[మార్చు]తన జీవిత విశేషాలతోపాటూ, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఈ పుస్తకంలో ఉన్నందున ఈ పుస్తకానికి నవ్యాంధ్రము నా జీవిత కథ అని పేరు పెట్టాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (22 January 2018). "బెజవాడ అడుగుజాడ అయ్యదేవర!". విజయవాడ, ఆంధ్రజ్యోతి. Retrieved 2 May 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రభూమి, సబ్ ఫీచర్ (26 February 2016). "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర' ( నేడు వర్ధంతి)". అయ్యదేవర పురుషోత్తమరావు. Retrieved 2 May 2018.
- ↑ ఎమ్మెస్కో బుక్స్. "నవ్యాంధ్రము నా జీవిత కథ". www.emescobooks.com. ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి. Retrieved 2 May 2018.[permanent dead link]
- ↑ మనవి పేజీ 9, నవ్యాంధ్రము