నవ్య హరిదాస్
నవ్య హరిదాస్ | |||
కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్
| |||
పదవీ కాలం 2016 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1985 కేరళ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి |
|
నవ్య హరిదాస్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనుంది.
జననం & విద్యాభాస్యం
[మార్చు]నవ్య హరిదాస్ 1985లో కేరళ రాష్ట్రంలో జన్మించింది. ఆమె కాలికట్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న కెఎంసిటి ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]నవ్య హరిదాస్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని 2016లో కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆమె 2021లో తిరిగి రెండోసారి కౌన్సిలర్‌గాఎన్నికై, అదే సంవత్సరం జరిగిన కేరళ శాసనసభ ఎన్నికలలో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అహమ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయి 24,873 ఓట్లను సాధించి, మూడో స్థానంలో నిలిచింది.[1]
నవ్య హరిదాస్ ప్రస్తుతం కేరళ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తుంది. ఆమెను 2024లో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది.[2][3] ఆమె ఈ ఎన్నికలలో పోటీ చేసి 1,09,939 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (2021). "Kerala Assembly Election Results 2021 - Kozhikode South". Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Wayanad bypoll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.