నశ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనం

నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికాలో ప్రారంభమై 17 వ శతాబ్దములో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము, యాలకులు, గులాబి, చెర్రీ, కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు . పనిచేయు విధానము : పొగాకులో నికొటిన్‌ (nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా, ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్‌ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్‌ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక, అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనముగా (addiction) మారుతుంది . ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్‌సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్‌సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్‌ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చదవండి

[మార్చు]
  • Ursula Bourne, Snuff. Shire Publications, 1990. [1]
  • John D. Hinds, "The Use of Tobacco." 1882. [2]
"https://te.wikipedia.org/w/index.php?title=నశ్యము&oldid=2996696" నుండి వెలికితీశారు