నాగన్న హోటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం జిల్లా, కూసుమంచి గ్రామంలోని నాగన్న హోటల్ ఈ ప్రాంతానికి ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. 20 నుంచి 30 వరకూ వేర్వేరు కూరలను భోజనంలో వడ్డించటం అది కూడా కుటుంబ తరహాలో కొసరి కొసరి వడ్డించటం ఈ హోటల్ కు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి.[1][2]

ఖమ్మంజిల్లా కూసుమంచి గ్రామంలోని నాగన్న హోటల్

నిర్వాహకులు

[మార్చు]

బెల్లంకొండ నాగన్న ఈ హోటల్ వ్యవస్థాపకులు, పూర్తి స్థాయి నిర్వాహకులు కూడా, ఈయనకు పనుల్లో మొదట కేవలం వీరి కుటుంబ సభ్యులు మాత్రమే సహకరిస్తే సరిపోయేది. కానీ హోటల్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నిర్వహణకు సిబ్బందిని కూడా నియమించారు. నాగన్న మే 22, 1965 లో బెల్లంకొండ వెంకట నర్సయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన 1986 మే మొదటి తారీఖున మణెమ్మ గారిని వివాహం చేసుకున్నారు, వీరికి మంజుల, గాయత్రి, వెంకట రామకృష్ణ అనే ముగ్గురు సంతానం. ఆడపిల్లలను మంచి చదువులు చదివించారు. కుమారుడు హోటల్ నిర్వహణలో తండ్రికి సహకరిస్తున్నారు.

ప్రారంభం

[మార్చు]

1995 లో పిబ్రవరి 12 వ తారీఖున ఈ హోటల్ ను రహదారికి పక్కనే వున్న చిన్న పూరి గుడిసెలో ప్రారంభించారు.

ఒడిదుడుకులు

[మార్చు]

ఇరవైకి పైగా నాణ్యమైన కూరలుంటాయి అనే మౌఖిక ప్రచారం చాలామందిని హోటల్ కు ఆకర్షించేలా చేసింది కానీ కూరగాయల రేట్లలో అనేక సార్లు హెచ్చుతగ్గులు రావడం, ఇన్ని రకాల కూారలూ వండుతున్నప్పటికీ కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా ఖర్చుకావడం వల్ల మిగిలిపోవడం, చిన్న ఊరు కాబట్టి కొన్ని రోజులు అస్సలు కస్టమర్లు సరిగా రాకపోవడం, లేదా ఏదైనా ప్రయాణంలో వున్న వారు ఒక్కసారిగా మధ్యాహ్నం బోజనానికి వచ్చేయడం, అంతమందికీ హడావిడిగా ఇన్నిరకాల కూరలను తయారు చేయించడం ప్రారంభించిన కొత్తలో కష్టంగా వుండేదట కానీ రాను రానూ ప్రణాళికా బద్దంగా పనిచేయటం అలవాటు పడిన తర్వాత ఈ సమస్యను అధిగమించినట్లు చెపుతున్నారు.

మూల సూత్రం

[మార్చు]

నాణ్యతే నమ్మకాన్ని నిలబెడుతుంది, వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది అనేదాన్ని ప్రాథమికంగా నమ్ముతూ ఈ హోటల్ ను నిర్వహిస్తున్నారు. దానికి తగ్గట్లాగానే పెద్ద పెద్ద బోర్డులు కానీ, ఆకర్షణ కోసం చేసే ఆడంబర అలంకరణలు కానీ లేకుండానే ఈ బోజన హోటల్ నిర్వహణ సాగుతోంది. ఇక్కడ తిని వెళ్ళిన వారి మౌఖిక ప్రచారం ఆధారంగా ఒకరినుంచి ఒకరికి విషయం తెలుస్తు ఇప్పటికి అనేక మంది కష్టమర్లను సంపాదించుకుంది.

పెరట్లో పండించిన కూరలు

[మార్చు]

ఈ బోజనశాలలో వడ్డించే కూరగాయల్లో చాలా వరకూ నాగన్న గారి ఇంటి పెరట్లో వాళ్ళు పండించినవే వుంటాయి.

ప్రముఖుల ప్రశంసలు

[మార్చు]

రాష్ట్ర రహదారి కావడం వల్ల, వెయ్యేళ్ళ ప్రాచీన చరిత్ర కల కూసుమంచి గణపేశ్వరాలయం వున్న ఊరు కావడం వల్ల ఈ ప్రాంతానికి సందర్శన నిమిత్తమో అటుగా వెళుతో వచ్చిన వారో ఈ హోటల్ దగ్గర ఒక్కసారి ఆగితే ఆ తర్వాత పనిపెట్టుకుని హోటల్ కోసమే వచ్చేవారట. అంతే కాదు తమకు తెలిసిన వారు, మిత్రులూ బంధువులకు దీనిని గురించి కూడా చెపుతుంటారు. సినీనటులు తొట్టెపూడి వేణు, తనికెళ్ళ భరణి వంటి వారు ఈ హోటల్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినీ దర్శకులు వంశీ అయితే తనకు జీవితంలో అత్యంత ఇష్టమైన ఐదు విషయాలను చెపుతూ అందులో ఒకటిగా ఈ నాగన్న హోటల్ ను ప్రస్తావించారు. నారా చంద్రబాబు నాయుడు ఈ హోటల్ ను ప్రత్యేకంగా సందర్శించి బోజనం చేేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రత్యేక కథనాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "నలభై కూరలతో కమ్మటిక్ భోజనం". Archived from the original on 2015-09-26. Retrieved 2015-11-26.
  2. "General Information of the hotel". Archived from the original on 2018-06-29. Retrieved 2015-11-26.

బయటి లింకులు

[మార్చు]