Coordinates: 24°21′21″N 70°45′16″E / 24.35583°N 70.75444°E / 24.35583; 70.75444

నాగర్‌పార్కర్ జైన దేవాలయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగర్‌పార్కర్ జైన దేవాలయాలు
نگرپارکر جین مندر
నాగర్‌పార్కర్ జైన దేవాలయాలు is located in Pakistan
నాగర్‌పార్కర్ జైన దేవాలయాలు
Shown within Pakistan
స్థానంకరూంఝర్ పర్వతాలు, సింధ్, పాకిస్తాన్
నిర్దేశాంకాలు24°21′21″N 70°45′16″E / 24.35583°N 70.75444°E / 24.35583; 70.75444
రకంజైన దేవాలయాలు, మసీదు
అధికారిక పేరునగర్‌పార్కర్ సాంస్కృతిక ప్రకృతి దృశ్యం
రకంతాత్కాలిక జాబితా
క్రైటేరియాiii, iv
గుర్తించిన తేదీ2016
రిఫరెన్సు సంఖ్య.6111

నాగర్‌పార్కర్ జైన దేవాలయాలు పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో గల నగర్‌పార్కర్ సమీపంలో ఉన్నాయి. ఇది పురాతన జైన దేవాలయాల సమూహం. దేవాలయాల నిర్మాణ శైలి ద్వారా ప్రభావితమైన మసీదు కూడా ఈ ప్రదేశంలో ఉంది. ఈ ఆలయాలు జైన వాస్తుశిల్పం బాగా ఉన్న కాలంలో అనగా 12 నుండి 15వ శతాబ్ద కాలంలో నిర్మించబడ్డాయి. 2016లో, ఈ మొత్తం ప్రాంతం ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది.[1]

ఆలయం[మార్చు]

ఈ ప్రాంతం అంతటా దాదాపు 14 జైన దేవాలయాలు ఉన్నాయి, వాటిలో గోరీ మందిర్, బజార్ మందిర్, భోడేసర్ టెంపుల్, వీర్వా జైన్ టెంపుల్ లు ప్రముకమైనవి.[1]

గోరీ మందిర్[మార్చు]

గోరీ మందిర్ వీర్వా మందిర్‌కు వాయువ్యంగా 14 మైళ్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని గుజరాతీ శైలిలో 1375-76 కాలంలో నిర్మించారు. ఇందులో 52 ఇస్లామిక్ శైలి గోపురాలతో 3 మంటపాలు ఉన్నాయి. ఈ ఆలయం 60 అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవు ఉండి, పాలరాతితో నిర్మించబడింది. ఆలయం మొత్తం ఒక ఎత్తైన ప్రదేశంపై నిర్మించబడింది. ఆలయంలో రాతితో చేసిన మెట్లు ఉన్నాయి. ఆలయం లోపలి భాగంలో పాలరాతి స్తంభాలపై చెక్కిన చక్కటి శిల్పాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించే మండపాన్ని జైన పురాణాలను సూచించే చిత్రాలతో అలంకరించారు. గోరీ దేవాలయంలోని కుడ్యచిత్రాలు భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో ఉన్న పురాతన జైన కుడ్యచిత్రాలు. ఆలయం అంతటా 24 చిన్న గదులు ఉన్నాయి, ఇవి జైనమతంలోని 24 తీర్థంకరులను సూచిస్తాయి.[2]

బజార్ దేవాలయం[మార్చు]

నగర్‌పార్కర్ నగరంలోని ప్రధాన ప్రాంతంలో బజార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం క్లిష్టమైన, అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయ శిఖరం, తోరన్ గేట్‌తో సహా పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. ఇది 1947లో భారతదేశం-పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందే వరకు బహుశా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఉపయోగించబడింది.[3]

భోడేసర్ ఆలయం[మార్చు]

నగర్‌పార్కర్ నుండి 4 మైళ్ల దూరంలో భోడేసర్ ఉంది, ఇక్కడ మూడు జైన దేవాలయాల శిధిలాలు ఉన్నాయి. సోధా పాలనలో భోడేసర్ ఈ ప్రాంతానికి రాజధాని. మూడు దేవాలయాలలో రెండు జంతు స్థావరాలుగా ఉపయోగించబడ్డాయి, మూడవ దేవాలయం వెనుక భాగం 1897లో శిథిలావస్థకు చేరుకుంది. భోడేసర్ తలాబ్ అని పిలువబడే పురాతన నీటి ట్యాంక్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న అతి పురాతనమైన ఆలయాన్ని దాదాపు 9వ శతాబ్దంలో పోనీ దహరో అనే జైన మహిళ నిర్మించింది. ఇది ఎటువంటి మోర్టార్ లేదా సున్నం లేకుండా రాళ్లతో శాస్త్రీయ శైలిలో నిర్మించబడింది. ఇది అందమైన రాతి, ఇతర నిర్మాణ అంశాలతో కూడిన భారీ స్తంభాలను కలిగి ఉంది. మిగిలిన గోడలు అస్థిరంగా, పాక్షికంగా కూలిపోయాయి. భవనం భాగాలను స్థానిక ప్రజలు కూల్చివేశారు. ఆ ఇటుకలను వారి ఇళ్లను నిర్మించడానికి ఉపయోగించారు. ఈ జైన దేవాలయాలు 1375 , 1449 కాలం లో నిర్మించబడ్డాయి.[4]

వీర్వా దేవాలయం[మార్చు]

వీర్వా మందిర్ నగర్‌పార్కర్‌కు ఉత్తరాన 15 మైళ్ల దూరంలో వీర్వా పట్టణానికి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం రాన్ ఆఫ్ కచ్ ఒడ్డున "పరింగర్" అనే పురాతన ఓడరేవు శిధిలాల సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు మూడు దేవాలయాలు ఉండేవి, వీటిని AD 456లో జెసో పర్మార్ స్థాపించినట్లు చెబుతారు. బ్రిటీష్ కాలంలో తెల్లని పాలరాయితో చేసిన ఆలయం ప్రస్తుతం ప్రసిద్ధిలో ఉంది. మరొక ఆలయంలో చక్కగా చెక్కబడిన పాలరాతి శిల్పాలు బ్రిటీష్ కాలంలో కరాచీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ పాకిస్థాన్‌కు బదిలీ చేయబడింది. మూడవ శిధిలమైన ఆలయంలో 18 అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గోపురం చుట్టూ 26 చిన్న గోపురాలు ఉన్నాయి. మధ్య గోపురం చక్కటి రాతి గుర్తులను కలిగి ఉంటుంది. సమీపంలోని రహదారి నిర్మాణ సమయంలో, కార్మికులు ప్రమాదవశాత్తూ అనేక జైన విగ్రహాలను కనుగొన్నారు, వాటిని స్థానికులు ఈ ఆలయాలలో ఉంచారు, మరికొందరు ఉమర్‌కోట్‌లోని మ్యూజియంకు తీసుకెళ్లారు.[5]

మసీదు[మార్చు]

భోడేసర్ తెల్లని పాలరాతి మసీదు చుట్టుపక్కల ఉన్న జైన దేవాలయాల వాస్తుశిల్పంచే ప్రభావితమై వాటి శైలిలో నిర్మించబడింది. ఈ మసీదును 1505లో గుజరాత్ సుల్తాన్ మహమూద్ బెగడ నిర్మించాడు. చుట్టుపక్కల ఉన్న జైన దేవాలయాలలో కనిపించే గోపురాల మాదిరిగానే ఈ మసీదుకు కూడా గోపురం ఉంది, ప్రతి వైపు 9.2 మీటర్ల పరిమాణంలో చతురస్రాకార భవనం ఉంటుంది. మసీదు స్తంభాలు కూడా జైన వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తాయి, పైకప్పు వెంట ఉన్న అలంకార అంశాలు కూడా జైన దేవాలయాల శైలిని పొంది ఉన్నాయి.[6]

ఇతర దేవాలయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Tentative Lists". UNESCO. Retrieved 16 September 2017.
  2. Shri Gaudi Parshvanth Stavan, Bhanvarlal Nahta, Shri Gaudi Parchvanath Tirth, Muni Jinavijaya Abhinandan Granth, Ed. Dalsukh Malvania, Jinavijayaji Samman Samiti, Jaipur, 1971, p. 263-275
  3. Kalhoro, Zulfiqar Ali. "The Jain Temples in Nagarparkar". Retrieved 16 September 2017.[permanent dead link]
  4. Vanishing temples of Thar and Nagar Parkar, Ameer Hamza, Dawn, October 21, 2006 http://archives.dawn.com/weekly/gallery/archive/061021/gallery3.htm Archived 2013-01-21 at Archive.today
  5. Hasan, Arif (8 July 2011). "The future of Nagarparkar". Express Tribune. Retrieved 16 September 2017.
  6. Hamza, Ameer (2006). "Vanishing temples of Thar and Nagar Parkar". Things Asian. Retrieved 16 September 2017.