Jump to content

నాటో కాన్

వికీపీడియా నుండి
నాటో కాన్
菅 直人
2007లో నాటో కాన్
జపాన్ ప్రధాన మంత్రి
In office
2010 జూన్ 8 – 2011 సెప్టెంబరు 2
చక్రవర్తిఅకిహిటో
అంతకు ముందు వారుయుకియో హటోయామా
తరువాత వారుయోషిహికో నోడా
జపాన్ ఉప ప్రధాన మంత్రి
In office
2009 సెప్టెంబరు 16 – 2010 జూన్ 8
ప్రధాన మంత్రియుకియో హటోయామా
అంతకు ముందు వారువతరు కుబో (1996)
సభ్యుడు, టోక్యో ప్రతినిధుల సభ
In office
2017 అక్టోబరు 22 – 2024 అక్టోబరు 9
అంతకు ముందు వారుమసతడ సుచియా
తరువాత వారుకౌరు ఫుకుడా
నియోజకవర్గం18వ జిల్లా
In office
2012 డిసెంబరు 16 – 2017 అక్టోబరు 22
అంతకు ముందు వారుహిదేహిరో మితాని
తరువాత వారుషున్సుకే ఇటో
నియోజకవర్గంపిఆర్ బ్లాక్
In office
1996 అక్టోబరు 20 – 2012 డిసెంబరు 16
అంతకు ముందు వారు-
తరువాత వారుమసతడ త్సుచియ
నియోజకవర్గం18వ జిల్లా
In office
1980 జులై 17 – 1996 అక్టోబరు 20
అంతకు ముందు వారుకియోషి ఓనో
తరువాత వారు-
నియోజకవర్గం7వ జిల్లా
వ్యక్తిగత వివరాలు
జననం (1946-10-10) 1946 అక్టోబరు 10 (వయసు: 79)
ఉబే, యమగుచి, జపాన్ సామ్రాజ్యం
రాజకీయ పార్టీకాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్
ఇతర రాజకీయ
పదవులు
స్వతంత్ర రాజకీయ నాయకుడు (మొదటగా)
సోషల్ సిటిజన్స్ అలయన్స్
సోషలిస్ట్ డెమోక్రటిక్ ఫెడరేషన్ (1993 కి ముందు)
న్యూ పార్టీ సకిగేక్ (1993–2017)
జీవిత భాగస్వామి
నోబుకో కాన్
(m. 1970)
సంతానం2
కళాశాలటోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వెబ్‌సైట్Official website

నాటో కాన్ (ఆంగ్లం: Naoto Kan; జననం 1946 అక్టోబరు 10), జపాన్ మాజీ రాజకీయ నాయకుడు. ఆయన జపాన్ ప్రధాన మంత్రిగా, జపాన్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా 2010 జూన్ నుండి 2011 సెప్టెంబరు వరకు పనిచేసాడు. 2006లో జునిచిరో కొయిజుమి రాజీనామా చేసిన తర్వాత ఒక సంవత్సరానికి పైగా సేవ చేసిన తొలి ప్రధానమంత్రి నాటో కాన్. అతని కంటే ముందర ప్రధానులైన యుకియో హటోయామా, తారో అసో, యసువో ఫుకుడా, షింజో అబే లు ఎవరూ అంత కాలం పాటు నిలవలేదు. 2011 ఆగస్టు 26న ఎన్నికలలో ఓడిపోవడంతో నాటో కాన్ తన రాజీనామాను ప్రకటించాడు. అతని తరువాత యోషిహికో నోడా ఎన్నికయ్యాడు.[1][2]

2012 ఆగష్టు 1న, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ 2015 అనంతర ఎజెండాలో ఆయన ఉన్నత స్థాయి ప్యానెల్ సభ్యులలో ఒకడిగా ఉంటాడని ప్రకటించాడు.[3]

నాటో కాన్ నవంబరు 2023లో రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[4] 2024 ఫిబ్రవరిలో ఆయన 'ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ సిటిజెన్ పాలిటిక్స్' పేరుతో రాజకీయాలలో తన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఒక జ్ఞాపికను ప్రచురించాడు.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

నాటో కాన్, సెంట్రల్ గ్లాస్ అనే గాజు తయారీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన హిసావో కాన్ పెద్ద కుమారుడు. అతను ఉబే, యమగుచిలో జన్మించాడు.[6] అతను 1970లో టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. 1971లో లైసెన్స్ పొందిన బెన్రిషి (పేటెంట్ ఏజెంట్/అటార్నీ) అయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నాటో కాన్ నోబుకోను 1970లో వివాహం చేసుకున్నాడు. ఓకాయామా ప్రిఫెక్చర్ లో జన్మించిన నోబుకో, సుడా కాలేజీలో ప్రవేశించిన తరువాత టోక్యోలో నివాసం ఉండే నాటో కాన్ తో పరిచయం ఏర్పడింది.[7][8] వారికి జెంటారో, షింజిరో అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జెంటారో ఒక సామాజిక కార్యకర్త, 2003, 2005 ప్రతినిధుల సభకు పోటీ చేసి విఫలమయ్యాడు. ఆ తరువాత, అతను తన తండ్రికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసాడు. 2023 డిసెంబరులో ముసాషినో నగర మండలికి ఎన్నికయ్యాడు.[9] షింజిరో పశువైద్యుడు, టోక్యోలో, నెరిమా లోని ఒక జంతు ఆసుపత్రిలో పనిచేస్తాడు.[10]

నాటో కాన్ కు "ఇరా-కాన్" అనే మారుపేరు ఉంది.[11] గో, షోగీ, ఒరిగామి వంటివి అతని హాబీలు.[12] సంక్లిష్టమైన మహ్జాంగ్ పాయింట్ వ్యవస్థను లెక్కించడానికి ఆయన ఒక యంత్రాన్ని నిర్మించి, 1973లో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.[13][14]

మూలాలు

[మార్చు]
  1. Yoree Koh (29 August 2011). "Noda, the DPJ and the Giant Snowball Problem". The Wall Street Journal. Retrieved 29 August 2011.
  2. Article 6 of the Constitution_of_Japan
  3. Ban names high-level panel to map out 'bold' vision for future global development efforts UN News Centre. 31 July 2012. Retrieved 20 December 2013.
  4. Satomi, Minoru (2023-11-05). "菅直人元首相、政界引退を表明 旧民主党結成、福島原発事故など対応" [Former Prime Minister Naoto Kan announces retirement from politics; response to Fukushima nuclear accident and formation of former Democratic Party]. The Asahi Shimbun (in జపనీస్). Retrieved 2025-09-21.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  5. "『市民政治50年』菅 直人 | 筑摩書房" ['Fifty Years of Citizen Politics' Naoto Kan | Chikuma Shobo]. Chikuma Shobo (in జపనీస్). Retrieved 2025-09-21.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  6. Seijika Jinmei Jiten: Meiji-Shōwa. Nichigai Asoshiētsu (Shintei ed.). Nichigai Asoshiētsu. 2003. p. 192. ISBN 4-8169-1805-1. OCLC 54645851.{{cite book}}: CS1 maint: others (link)
  7. Keating, Joshua (8 June 2010). "Japan's prime minister is married to his first cousin". Foreign Policy. Retrieved 14 June 2010.
  8. 基礎から分かる(菅直人). Yomiuri Shimbun (in జపనీస్). 5 June 2010. Retrieved 8 June 2010.
  9. Shiori, Aya (24 December 2023). "菅直人元首相の長男、武蔵野市議補選で初当選確実 世襲の指摘は否定". Asahi Shimbun (in జపనీస్). Tokyo. Retrieved 15 October 2024.
  10. ヒラミ動物病院 (in జపనీస్). Archived from the original on 23 February 2009. Retrieved 8 June 2010.
  11. Demetriou, Danielle (4 June 2010). "Naoto Kan: profile". The Telegraph. London. Retrieved 17 March 2011.
  12. "Kan: Activist, politico, mah-jongg lover". AsiaOne News. 5 June 2010. Archived from the original on 18 March 2012. Retrieved 8 June 2010.
  13. Hayashi, Yuka (4 June 2010). "Japan's Premier Aims for Longer Stay". The Wall Street Journal. Retrieved 8 June 2010.
  14. Amano, Tomomichi (4 June 2010). "Kan and His Amazing Mahjong Machine". The Wall Street Journal. Retrieved 29 September 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=నాటో_కాన్&oldid=4683125" నుండి వెలికితీశారు