Jump to content

నాద బ్రాహ్మణులు

వికీపీడియా నుండి

నాద బ్రాహ్మణులు సుప్రసిద్ధ ''నాదోపాసకులు''. "వేదం" ఎంత గోప్పదో "నాదం" కుడా అంతే గోప్పది.పురాతన కాలం నుండి నాద బ్రాహ్మణులు సంగీతములో సుప్రసిద్ధులు విరిని నాయ బ్రాహ్మణులు, మంగళ వాద్యకారులు అని కుడా పిలుస్తారు. ఈ సంగీతాన్ని '''నాదబ్రహ్మా'' కు చిహ్నంగా భావిస్తారు, విరిని నాద  బ్రాహ్మణులు (లేక) శబ్ద బ్రాహ్మణులు గా పరిగణిస్తారు. నాదబ్రాహ్మణులలో పూర్వం నుండి "నాదస్వర, శృంగభేరి" విద్వాంసులు ప్రసిద్ధులు. 12వ శతాబ్ద్ధానికి చెందిన ప్రముఖ తమిళ రామాయణం రచయిత "కంబర్" నాద బ్రాహ్మణ(ఓచన్) కులానికి చెందినవారు, వారి పూర్వికులు సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు. నాద బ్రాహ్మణులు(శబ్ధ బ్రాహ్మణులు III.12.48, Vi.16.51) గురించి వేద గ్రంధాలలో (Xi.21.36, X.20.43) మైత్రీ ఉపనిషత్తు ప్రకారం తాత్విక పదాలలో రెండు రకాల బ్రాహ్మణులు ఉన్నారు వారిలో ఒకరు నాద బ్రాహ్మణులు నాదం(ధ్వని) తో దేవుడిని పూజించువారు మరియొకరు "వేద బ్రాహ్మణులు" వేద మంత్రాలతో దేవుడిని సేవించువారు (మైత్రీ ఉపనిషత్ VI.22).[1]

నాదం సామవేద సారం

[మార్చు]

సంగీతం సామవేద సారం, సంగీతం నాదమయం. సామం అనగా మధురమైనది, వేదం అనగా జ్ఞానం. సంగీతం ఉత్తేజాన్నిస్తుంది మానసిక జ్ఞానాన్ని ప్రసాదిస్తూంది. వేదాన్ని మంత్రోచ్చారణ తో పలికే వాడు వేద బ్రాహ్మణుడు, నాదాన్ని సంగీతోచ్చారణ తో పలికించే వాడు నాద బ్రాహ్మణుడు.
నాదం అంటే?
’న’ కారానికి ప్రాణమని, ’ద’ కారానికి అగ్ని అని ప్రాణాగ్నుల సంయోగంతో ఉద్భవించేదే నాదమని శాస్త్రం చెప్తుంది.
నాదం అనగా బ్రహ్మం !
నాదం పరబ్రహ్మ స్వరూపం !
వేదం మహావిష్ణు స్వరూపం !
ఈ సృష్టి అంతా నాద బ్రహ్మమయం. సర్వము అక్షరాత్మకము, వైఖరి శబ్ద బ్రహ్మమయము. శబ్దమే బ్రహ్మము. నాదమే బ్రహ్మము. అక్షరములు అచ్చులు, హల్లులు పరమ శివుని చే అనుగ్రహింప బడినవి. ఒక్కో వర్ణము ఒక్కో దేవతను, తత్వమును సూచించును. కావున అక్షరములన్నియు మంత్రము లగుచున్నవి. అందుకే ఆ సర్వమంగళ మాతృకావర్ణ రూపిణి అయినది. సర్వ వర్ణములలో మొట్ట మొదటి అక్షరము అయిన “అకారము” శివుడు, ప్రకాశము. అంత్యాక్షరమైన “హకారము” శక్తి, విమర్శము. వీని సామరస్యమే “అహం”. అచ్చులు శక్తి రూపములు. హల్లులు శివ రూపములు. ఓం కారము నుండి సకల వర్ణములు ఉత్పన్నము లైనవని వేదములు, పురాణములు ఘోషించు చున్నవి. ఓం ధ్వని పరబ్రహ్మము. మూలాధారాది షట్చక్రముల తాకిడిచే వర్ణముల ఉత్పత్తి గల్గును అని తంత్రములు చెప్పుచున్నవి. ప్రతి శబ్దమునకు ఒక్కో అర్ధము కలదని, శక్తి, ఈశ్వర తత్వముల కలయక నుండి ధ్వని పుట్టు చున్నదని మంత్ర శాస్త్రములు చెప్పు చున్నవి. అకారాది హకారాంతము వరకు గల ఏబది వర్ణములు మాతృకా వర్ణములు.[2][3]

సంగీతం అంటే

[మార్చు]

సంగీతం అంటే ఓంకారం ఆది ప్రణవ నాదం. భాష పుట్టుకకు ఓంకారం మూలం. సమస్త విద్యలు ఓంకారావిర్భవితాలే. ఓంకారం నుంచే సంగీతం ఆవిర్భవించింది. భారతీయ సంగీత విద్యలో రెండు ముఖ్య విభాగాలు. ఒకటి కర్ణాటక సంగీతం,రెండవది హిందుస్తానీ సంగీతం. గాత్రం,వాద్యం సంగీతంలో విభాగాలు గాత్రం సంగీతంలో అతి ముఖ్యమైనది, వాద్యం గాత్రానికి సహాయం చేస్తుంది.

  • నాద స్వరం
  • డోలు
  • హార్మోని
  • వయోలిన్
  • పిల్లన గ్రోవి(flute)
  • వీణ
  • మృదంగం
  • తబలా
  • సితార్

ఇందులో ఏది తక్కువని అనుకున్న మనల్ని మనం తక్కువ అనుకున్నట్లే.ఈ విద్య నేర్చుకుంటే తెలుస్తుంది ఈ విద్య గొప్పదనం.

వైద్యం లో భాగం సంగీతం

[మార్చు]

సైన్స్ ప్రకారం ఏవైనా రెండు ఘన, ద్రవ, వాయు పదార్థాల తాకిడివల్ల వచ్చేది శబ్దం లేక నాదం. ఆ నాదం నుంచి ఉదయించిందే వేదం. సైన్స్ ప్రకారం వైద్యము నుండి వెలువడినదే సంగీతం, వైద్యము చేసేటప్పుడు రోగి మనస్సు ప్రశాంతముగా ఉండటానికి వైద్యులే సంగిత వాద్యాలను వాయించేవారు ప్రస్తూత రోజులలో దినినే "మ్యూజిక్ ధెరపి(music therapy)" అంటున్నారు. పురాణకాలం నుండి నాదబ్రాహ్మణులు రాజుల దగ్గర ఆస్తాన విధ్వాంసులుగా ఉండి వారి మన్ననలు పోందేవారు.వారు వారి వాద్యముతో రాజులను, సామన్య ప్రజలను సైతం ఆహ్లదపరిచేవారు. ప్రస్తుత రోజులలో నాదబ్రాహ్మణులు అనేక హిందు దేవాలయలలో ఆస్థాన విధ్వాంసులుగాను, గాయకులుగాను ఉంటున్నారు.

ప్రసిద్ధి పోందిన కోందరు నాద బ్రాహ్మణులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sabda". Archived from the original on 2012-10-24. Retrieved 2017-12-02.
  2. Richard King. Indian Philosophy: An Introduction to Hindu and Buddhist Thought. Edinburgh University Press. p. 49.
  3. William Albert Graham. Islamic and Comparative Religious Studies. Ashgate Publishing Ltd. p. 253.