నానా రాజన్య చరిత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటీష్ ఇండియాలో ప్రిన్స్‌లీ స్టేట్స్ (Princely states) గా పిలుచుకునే రాజ్యాల పాలకుల (ప్రముఖంగా తెలుగు వారు) గురించీ, వారి వంశక్రమణిక గురించీ వ్రాసిన పుస్తకమిది. వేంకటగిరి, ముత్యాలపాటి, వాసిరెడ్డి వంటి 10 సంస్థానాల వివరాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఆనాటి సాంఘిక, రాజకీయ స్థితిగరులు ఈ పుస్తకంలో అంతర్లీనంగా కనిపిస్తూంటుంది.

దీనిని మచిలీపట్నంలోని నోబిల్ కాలేజీ ఆంధ్రోపాధ్యాయులైన శ్రీరామ వీరబ్రహ్మము (Sreeram Veerabrahmam) రచించగా 1918లో ముద్రించారు. దీని గుంటూరు జిల్లా డిప్యూటీ కలక్టరు చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్ పీఠికను అందించారు.

పేర్కొన్న రాజవంశములు[మార్చు]

 • కొచ్చెర్లకోటవారి సంస్థానము
 • చా మహల్ సంస్థానము
 • దేవరకోట సంస్థానము
 • నూజివీడు సంస్థానము
  • ఉయ్యూరు
  • కపిలేశ్వరపురము
  • తేలప్రోలు
  • మీర్జాపురము
  • మేడూరు
 • బొమ్మదేవరవారి సంస్థానము
  • దక్షిణ వల్లూరు
 • మైలవర సంస్థానము
 • ముత్యాలపాటి సంస్థానము
 • మునగాల సంస్థానము
 • మంత్రిప్రెగడవారి సంస్థానము
 • మందసా సంస్థానము
 • వత్సవాయ సంస్థానము
 • వాసిరెడ్డి సంస్థానము
 • విస్సన్నపేట సంస్థానము
 • వేంకటగిరి సంస్థానము

బయటి లింకులు[మార్చు]