నామాల తాతయ్య
నామాల తాతయ్య (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
తారాగణం | రంగనాథ్, మాధవి |
సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సాయి ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]శ్రీనివాసరావు, పద్మావతి అన్యోన్య దంపతులు. పద్మావతి ఆడపిల్లను ప్రసవించి మరణిస్తుంది. శ్రీనివాసరావు తన పాపకి జ్యోతి అని పేరుపెట్టి పెంచుతూ వుంటాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడు. అమ్మ కావాలని మారాం చేస్తున్న జ్యోతికి అమ్మ తిరుమల కొండపై ఉన్న నామాల తాతయ్య దగ్గర వుందని నౌకరు వెంకన్న చెబుతాడు. అప్పటి నుండి జ్యోతికి నామాల తాతయ్య స్మరణ ఎక్కువ అవుతుంది. ఒకసారి జ్యోతి నామాల తాతయ్యకు తన అమ్మని త్వరగా పంపించమని ఉత్తరం రాస్తుంది. ఆ లేఖను చూచి మనసు ద్రవించి పోస్టు మాస్టరు కుమార్తె చిన్నమ్మ నామాల తాతయ్య పేరుతో జవాబు పంపుతుంది. జ్యోతిని కలుసుకుని ఎన్నో కథలు చెబుతుంది. శ్రీనివాసరావు చిన్నమ్మను మందలిస్తాడు. తన ఆస్తిపై కన్ను వేసిందని ఆరోపిస్తాడు. దానితో జ్యోతికి ఉత్తరాలు బంద్ అవుతాయి. జ్యోతి బెంగతో మంచం పడుతుంది. ఏడుకొండలవాడు చిన్నమ్మ రూపంలో వచ్చి జ్యోతికి స్వస్థత చేకూరుస్తాడు. జ్యోతిని చంపి శ్రీనివాసరావు ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నిన శ్రీనివాసరావు మేనత్త వేసిన ఎత్తులన్నింటినీ ఏడుకొండలవాడు చిత్తు చేస్తాడు. నామాల తాతయ్య జ్యోతికి కలలో కనిపించి "తిరుమల కొండకు రా, అమ్మను చూపిస్తాను" అని చెబుతాడు. జ్యోతి ఒంటరిగా కొండకు ప్రయాణమవుతుంది. జ్యోతికి అమ్మ ఎలా దొరికింది అన్నది చిత్రంలో పతాక సన్నివేశం[1].
పాటలు
[మార్చు]- నామాల తాతయ్యే నీకూ నాకూ అందరిదీ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- బెల్ బాటం వేసుకున్న బుల్ బుల్ పిట్టా నా బుల్ బుల్ పిట్టా
- ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ
- జీవించనీ నీ నీడలో
- ఏడు కొండలెక్కినా దేవుడొక్కడే ఏడు జన్మలెత్తినా అమ్మ ఒక్కతే
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు : కె.హేమాంబరధర రావు
- నిర్మాత: ఎస్. రియాజ్ భాషా
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్. (12 April 1979). "చిత్రసమీక్ష - నామాల తాతయ్య". ఆంధ్రపత్రిక దినపత్రిక. 66 (11): 4. Retrieved 13 December 2017.[permanent dead link]