Jump to content

నాయకుడు (2023 సినిమా)

వికీపీడియా నుండి
నాయకుడు
దర్శకత్వంమారి సెల్వరాజ్‌
రచనమారి సెల్వరాజ్‌
దీనిపై ఆధారితంమామన్నన్‌
నిర్మాతఉదయనిధి స్టాలిన్
తారాగణం
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుసెల్వ ఆర్.కే.
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
రెడ్ జెయింట్ మూవీస్
పంపిణీదార్లుసురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్‌ సినిమాస్
విడుదల తేదీ
2023 జులై 14 (2023-07-14)
సినిమా నిడివి
155
దేశంభారతదేశం
భాషతెలుగు

నాయకుడు 2023లో విడుదలైన తెలుగు సినిమా. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై తమిళంలో మామన్నన్‌ పేరుతో ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించగా తెలుగులో నాయకుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ విడుదల చేశారు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంలో 2023 జూన్ 29న, తెలుగులో జూన్ 14న థియేటర్లలో విడుదల చేసి[1], నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జులై 27న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

మామన్నన్ (వడివేలు) అణాగారిన వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తుంటారు. ఆయన కొడుకు వీరన్ (ఉదయనిధి ) అభ్యుదయ భావాలు ఉన్న యువకుడు. కుల వ్యవస్థ వల్ల చిన్నప్పటి నుంచే అనేక అవమానాలు ఎదుర్కొంటాడు. వీరకు స్నేహితురాలైన లీలా (కీర్తి సురేష్) స్థానికంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ నడుపుతుంటుంది. ఆమె కోచింగ్‌ సెంటర్‌ను బలవంతంగా మూయించే ప్రయత్నం రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేసేందుకు వచ్చిన మామన్నన్, వీరన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (7 July 2023). "'నాయకుడు' వస్తున్నాడు". the original నుండి 30 July 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2023.
  2. Namasthe Telangana (18 July 2023). "రెండు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి నాయకుడు సినిమా..!". the original నుండి 30 July 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2023.
  3. Eenadu (27 July 2023). "రివ్యూ: నాయకుడు.. తమిళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో మెప్పించిందా?". the original నుండి 30 July 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2023.
  4. A. B. P. Desam (13 July 2023). "నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?". the original నుండి 30 July 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2023.

బయటి లింకులు

[మార్చు]