నాయకురాలు (నాటకం)
స్వరూపం
నాయకురాలు | |
కృతికర్త: | ఉన్నవ లక్ష్మీనారాయణ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | త్రివేణి ప్రెస్, మచిలీపట్నం |
విడుదల: | 1926, 1969 (రెండవ ముద్రణ) |
పేజీలు: | 134 |
నాయకురాలు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నాటకం. 1901లో వచ్చిన ఈ నాటకంలో పల్నాటి వీరచరిత్రను గురించి రాయబడింది.[1]
కథా నేపథ్యం
[మార్చు]పౌరుషాలకు పురిటిగడ్డగా నిలిచిన పల్నాడులో దాయాదుల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో రచించిన ఈ నాటకంలో పలనాటి వీరుల బలాబలాల గురించి రాయబడింది. నాగమ్మ పాత్ర కీలకంగా చిత్రించబడి మానవధర్మం కన్నా సత్యధర్మమే గొప్పదన్న సందేశంతో సాగిన ఈ నాటకంలో సంభాషణలు, పద్యాలు చక్కగా కుదిరాయి.
పాత్రలు
[మార్చు]- ప్రతాపుడు
- నాగాంబిక (నాయకురాలు)
- బ్రహ్మనాయుడు
- బాలచంద్రుడు
- నలగామరాజు
- నరసింగరాజు
- మలిదేవరాజు
- అలుగురాజు
- కొమ్మరాజు
- అలరాజు
- కేతరాజు
- ఝట్టిరాజు
- పొదిలె పాపన్న
- కల్వగుంట కాశీపతి
- కేతురెడ్డి
- రామిరెడ్డి
- ముతసాని పిచ్చిరెడ్డి
- కన్నమదాసు
- లంకన్న
- చాకలి చంద్రన్న
- మంగలి మంచన్న
- కుమ్మరి తేర్కుడు
- అనపోతు
- అర్చకుడు
- సేవకుడు
- పెద్దసెట్టి
- బ్రహ్మణుడు
- గుమాస్తా
- సుద్ధులవాడు
- చెంచునాయకుడు
- గోసాయిలు
- సైనికులు
- ప్రజలు
మూలాలు
[మార్చు]- ↑ జాతీయోద్యమ ప్రతిబింబం నాయకురాలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 19 జూన్ 2017, పుట.14