నారాయణ్ చందేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణ్ చందేల్
ప్రతిపక్ష నాయకుడు,
ఛత్తీస్‌గఢ్ శాసనసభ
Assumed office
2022 ఆగస్టు 18
ముఖ్యమంత్రిభూపేష్ బాఘేల్
అంతకు ముందు వారుధరమ్‌లాల్ కౌశిక్
డిప్యూటీ స్పీకర్
In office
2010 ఆగస్టు 2 – 2013 డిసెంబరు 11
స్పీకర్ధరమ్‌లాల్ కౌశిక్
అంతకు ముందు వారుబద్రీధర్ దివాన్
తరువాత వారుబద్రీధర్ దివాన్
ఛత్తీస్‌గఢ్ శాసనసభ సభ్యుడు
Assumed office
2018 డిసెంబరు 11
అంతకు ముందు వారుమోతీలాల్ దేవాంగన్
నియోజకవర్గంజంజ్‌గిర్-చంపా శాసనసభ నియోజకవర్గం
In office
2008–2013
అంతకు ముందు వారుమోతీలాల్ దేవాంగన్
తరువాత వారుమోతీలాల్ దేవాంగన్
నియోజకవర్గంజంజ్‌గిర్-చంపా
మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1998–2003
అంతకు ముందు వారుచరణ్ దాస్ మహంత్
తరువాత వారుమోతీ లాల్ దేవాంగన్
నియోజకవర్గంచంపా
వ్యక్తిగత వివరాలు
జననం (1965-04-19) 1965 ఏప్రిల్ 19 (వయసు 59)
జంజ్‌గిర్, మధ్యప్రదేశ్, భారతదేశం
(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశం)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిప్రమీలా చందేల్
సంతానం1 కుమారుడు, 2 కూతుర్లు
నివాసంజంజ్‌గిర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
నైపుణ్యంరాజకీయ నాయకుడు

నారాయణ్ చందేల్ (హిందీ: नारायण चंदेल; జననం 1965 19 ఏప్రిల్) భారతీయ రాజకీయ నాయకుడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీలకు క్రియాశీల సభ్యుడు. ప్రస్తుతం, ఆయన జంజ్‌గిర్-చంపా శాసనసభ నియోజకవర్గంనకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.[1] గతంలో, ఛత్తీస్‌గఢ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఆయన తొలిసారిగా 1998లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆయన 2003 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసాడు, అయితే 7,710 ఓట్ల తేడాతో భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన మోతీలాల్ దేవాంగన్ చేతిలో ఓడిపోయాడు.

మళ్లీ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఛత్తీస్‌గఢ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. 2018లో, ఆయన 4,188 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతీ లాల్ దేవాంగన్‌ను ఓడించి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

1965 ఏప్రిల్ 19న నైలా జాంజ్‌గిర్ చంపాలో జాంగీరామ్ చందేల్, శ్యామా చందేల్ దంపతులకు జన్మించాడు.[4] గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన, ప్రమీలా చందేల్‌ను వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి చందేల్, సోనాలి, ఒక కుమారుడు పలాష్ చందేల్ ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Chhattisgarh: BJP appoints MLA Narayan Chandel as new legislative party leader". Hindustan Times. 2022-08-18.
  2. "इंतजार खत्म, तैयार हुई 'विष्णु-सेना', 8 उपाध्यक्ष, 4 महामंत्री, 8 प्रदेश मंत्री, सेनापति भी तय | Hari Bhoomi". 30 September 2020.
  3. http://election.cg.nic.in/trmsacelection2018/resultacelection.aspx[permanent dead link]
  4. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2023-11-10. Retrieved 2023-11-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)