Jump to content

నారుమడి

వికీపీడియా నుండి
(నారు మడి నుండి దారిమార్పు చెందింది)

పంటను నేరుగా పొలంలో విత్తకుండా, ముందుగా చిన్న ప్రదేశంలో విత్తనాలు నాటి నారును పెంచి, ఆ తర్వాత ఆరోగ్యకరమైన నారును ప్రధాన పొలంలో నాటే పద్ధతిని నారుమడి అంటారు. దీనివల్ల పంటకు మంచి మొలక శాతం, చీడపీడల నివారణ, మెరుగైన దిగుబడి వస్తుంది. ఈ విధానం ఒక్కో పంటకు ఒక్కో విధంగా వుంటుంది. ఉదాహరణకు వరి, పత్తి, వంగ, మిరప మొదలగునవి.

మూడురకాల నారుమడులు

[మార్చు]

వరి నారుమడులు సాధారణంగా మూడురకాలుగా ఉంటాయి. పొడినారుమడి, బురద నారుమడి, మ్యాట్‌పై నారుమడిగా చెబుతారు. మండలంలో ముఖ్యంగా పొడి నారుమడి బురద నారుమళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తా రు. పొడి నారుమడి అనగా పొడి దుక్కిలోనే పొడివడ్ల గింజలను వెదజల్లి మట్టిని కప్పుతారు. వర్షపు నీటి ఆధారంతో, బోరుబావుల ద్వారా నీటిని అందించడంతో నారు మొలుస్తుంది. ఈ పద్ధతిని ముఖ్యంగా చెరువులు, కుంటలు, కాలువల కింద మొదట నీటి వసతి లేకుండా వర్షపు నీటిపైనే ఆధారపడే ప్రదేశాల్లో ఉపయోగిస్తారు.

వరి నారుమడి తయారీ

[మార్చు]

నారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి (నీటితో నింపి), చదును చేయాలి. నీరు పెట్టేందుకు ఎక్కువైతే తీయడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి. వడ్లను 24 గంటల పాటు నీటిలో నానబెట్టి తీసిన అనంతరం మరో 24 గంటల పాటు మండె కట్టి తరువాత చిన్నగా మొలకత్తిన వడ్ల గింజలను దమ్ము చేసిన మడిలో వెదజల్లుతారు. బోరు బావుల కింద, నీటి వసతి గల భూముల్లో ఈ పద్ధతిని సాగు చేయాలి. కాగా ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్‌ (వరి నారు యంత్రం)తో నాట్లు వేయడం కోసం నారు మడిని మ్యాట్లపై వేస్తారు. యంత్రంలో బిగించడానికి అను గుణంగా పొలంలో సన్నపాటి మందం గల మ్యాట్లను పరిచి వాటిపై ఎరువులతో కూడిన మట్టిని వేసి నారును పెంచుతారు. నారు పెరిగిన తరువాత మ్యాట్లను చుట్టి యంత్రాల్లో పెట్టి నాట్లు వేస్తారు. దీని కోసం రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వరి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]

నీటి వసతి, ప్రాంతాన్ని బట్టి చీడపీడలను తట్టుకునే వరి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పొలం నుంచి సేకరించిన వడ్ల గింజలను వాడాలి. ఎంపిక చేసిన రకాల కాలపరిమితిని బట్టి నిర్ణీత సమయంలో నారు వేసుకోవాలి, దీర్ఘకాలిక రకాలు 140 రోజుల కన్నా ఎకువ, జూన్ 20 వరకు మధ్య స్వల్పకాలిక రకాలు. అలాగే 110 నుంచి 135 రోజులు, జూలై 15 వరకు స్వల్పకాలిక రకాలు. జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు. ఎకరాల వరి సాగుకు సన్నరకం 20 కిలోల వాడాలి, దొడ్డురకానికి 25 కిలోలు వాడాలి. నాటేముందు మొలక శాతాన్ని పరీక్షించుకొని నీరుపెట్టేందుకు, వదిలేయడానికి వీలుగా కాల్వలతో కూడిన ఎతె్తైన నారుమడులు చేసుకోవాలి. వరి విత్తనాలు నానబెట్టడానికి వాడే గోనె సంచి కొంచెం పెద్దగా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తేజమైన మొలక వస్తుంది. నారుమడి దున్నేటప్పుడు 250 కిలోల పశువుల ఎరువు ప్రతి రెండు గుంటలకు వేయాలి. విత్తనశుద్ధి విధిగా చేసుకోవాలి.

వరి విత్తనశుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిమ్‌ కలిపి 24 గంటల తర్వాత చల్లాలి. రెండు గుంటల నారుమడిలో రెండు కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్‌ ఇచ్చే ఎరువులను విత్తేముందు సగం, విత్తిన 15 రోజులకు సగం వేయాలి. భాస్వరం, పొటాష్‌ విత్తే ముందు వేయాలి. దుంపనార మడికైతే లీటర్‌ నీటిలో కిలోవిత్తనానికి ఒక గ్రాము కార్బెండిజం, లీటర్‌ మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో పలుచగా సమానంగా చల్లాలి. చిక్కగా అలిపిన నారు సన్నగా పెరగడంతో నాటే సమయంలో ఒకే కుదురుకు 5 లేదా 6 మొక్కలు పెట్టే అవకాశం ఉంటుంది. నారుమడి చుట్టూ గట్ల మీద చీడపీడలకు ఆశ్రయం ఇచ్చే తుంగ, చిప్పెర, గరిక ఊసలం వంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్గితెగులు బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడిలో నారు తీయడానికి వారం ముందు రెండు గుంటల నారుమడికి పల్చగా నీరు పెట్టాలి. తద్వారా ఉల్లి కోడు కాండం తొలిచూపును నివారించవచ్చు. పూర్తిస్థాయిలో నారుమడిలో సస్యరక్షణను పాటించినట్లయితే వరి సాగులో అనుకున్న రీతిలో దిగుమతి పొందేందుకు రైతులకు అవకాశం ఉంటుంది.

ఎకరానికి 30 కిలోల విత్తనాలు

[మార్చు]

ఎకరానికి 30 నుంచి 40 కిలోల వరి విత్తనాలు అవసరమవుతాయి. 20 సెంట్ల విస్తీర్ణంలో విత్తనాలు వేసుకోవాలి. 1.5 మీటర్ల వెడల్పుతో ప్లాట్స్‌ లాగా చేసుకొని విత్తనాన్ని వేయాలి. విత్తనం వేసే ముందు కిలో విత్తనానికి 3-4 గ్రాములు కాప్టన్‌ లేదా థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దుక్కిలోనే హెక్టర్‌కు 1 టన్ను పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువు వేసుకోవాలి. మూడు కిలోలల భాస్వరం ఇచ్చే ఎరువు, రెండు కిలోలల పోటాస్‌లను వేయాలి. ఈ పద్ధతిలో ముఖ్యంగా ఐరన్‌, పోటాషియం లోపం కనిపిస్తుంది. దీనిని నివారించుకోవడానికి సూక్ష్మపోషకాలను పిచికారి చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయంలో అయితే వరి విత్తనాలు 5 కేజీల నుంచి 8 కేజీలు సరిపోతాయి. నాట్లు దూరంగా వేస్తారు కాబట్టి నారు తక్కువ వున్నా సరిపోతుంది.

దిగుబడిలో నారుమడి కీలకం

[మార్చు]

రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేసుకునేందుకు సస్యరక్షణ చర్యలు, నారుమడి పెంపకం గురించి ముందుగానే తెలుసుకోవాలి. మేలైన గింజలను ఎంపిక చేసుకోవాలి. వాటిని ఒకరోజు నానబెట్టి చల్లినట్లయితే అనుకున్న రీతిలో మొలక వస్తుంది. నారుమడిలో ఎకువ స్థాయిలో నీరు ఉంచకుండగా మొలకకు కావలసినంతనే పెట్టాలి. అవసరమైన క్రిమిసంహారక మందులు వాడితే వరి దిగుబడి బాగా వస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నారుమడి&oldid=4688332" నుండి వెలికితీశారు