Jump to content

నారు

వికీపీడియా నుండి
ప్రధాన పొలంలో నాటిన మిరపనారు

వార్షిక లేదా బహువార్షిక మొక్కలకు సంబంధించిన విత్తనాలను ఒక చోట గుంపుగా పెంచి కొద్దిగా పెరిగిన మొక్కలను మరొక చోట నాటుతారు, ఈ విధంగా ఒక చోట మొలక ఎత్తి తిరిగి మరొక చోట నాటేందుకు తయారుచేసిన మొలకెత్తే మొక్కలను నారు అంటారు. ఉదాహరణకు వరినారు, మిరపనారు.

వరి పంట పండేందుకు అనుకూలమైన నేలను ఎన్నుకోవాలి. వరి ఎర్ర రేగడి, నల్ల రేగడి నేలలలో పండుతుంది. మొదటగా మీరు మీ నేల సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఒక ఎకరం పొలం నాటు వేయడానికి నిర్ణయించుకుందామనుకుంటే  ఒక 50 కిలోగ్రాముల వడ్లను (వరిధాన్యాలను ) నీటిలో ఒక 20 రోజుల పాటు రోజుకి మూడు పూటల తడి పేసి తీయాలి. అలా వరి ధాన్యాలకు చివర మొలకలు వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఆ తరువాత మొలకలు వచ్చిన వరి ధాన్యాలను ఆ పొలంలో చల్లాలి. ప్రతిరోజూ ఆ పొలంలో సరిపడా నీరు ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని రోజులకు నారు ఎదగగానే వాటిని చిన్న చిన్న కట్టలు గా ముడి వెయాలి. దీనిని వరినారు అంటారు. దీనిని పొలాలలో తగినంత నీరు ఉండేట్టు చూసుకొని వరిని పొలాలలో నాటాలి.

నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారుమడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎ౦పిక చేసుకోవాలి.ఎ౦పిక చేసుకున్న పొలానికి 5-10 సె౦. మీ. నిళ్ళు పెట్టె బాగా కలియ దున్నాలి. తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్యేలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం ను౦డి కలుపు మొక్కలు లేకు౦దా జాగ్రత్త పడాలి. నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారుమడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎ౦పిక చేసుకోవాలి.ఎ౦పిక చేసుకున్న పొలానికి 5-10 సె౦. మీ. నిళ్ళు పెట్టె బాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం ను౦డి కలుపు మొక్కలు లేకు౦దా జాగ్రత్త పడాలి. [1]

మిరప

[మార్చు]

కిలో మిరప విత్తనాలకు థయిరం 3 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. భూమిని సమతలంగా ఉండేటట్లు ఎత్తుగా చేసి నారు పోయాలి. భూమిలో తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నారు ఎండిపోతుంది. బెడ్‌గా చేసి నారు పోయడం వల్ల నారులో వేర్లు దృఢంగా ఏర్పడతాయి. దీంతో నారు తీసి నాట్లు వేయగానే మిరప నాటుకుంటుంది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Paddy / వరి ! – Jindam Agro Farms" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-11. Retrieved 2021-04-11.
  2. "మిరప సాగుకు తరుణమిది". Sakshi. 2014-09-05. Retrieved 2021-04-11.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నారు&oldid=3229475" నుండి వెలికితీశారు