Jump to content

నాళం మట్టపల్లి

వికీపీడియా నుండి

నాళం మట్టపల్లి పలనాటి గాంధీగా జాతీయోద్య మంలో కీలక భూమి పోషించి మహాత్ముని మన్ననలను పొందిన నిరాడంబరుడు. అకుంఠిత దీక్షా పరుడు నాళం మటుపల్లి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన  గుంటూరు జిల్లాకు చెందిన రెంటచింతలలో జన్మించారు. రెంటచింతల కేంద్రంగా ఖాదీ ఉద్య మాన్ని నడిపిన మటుపల్లి స్వగృహంలోనే వందలాది రాట్నాలతో ఖాదీని వడికి ఉద్యమాన్ని నడిపారు. మహాత్ముడి అడుగు జాడలలో నడిచిన మటుపల్లి స్వాతంత్ర్య పోరాటానికి తన యావదాస్థిని సమర్పించారు. మహాత్మాగాంధీని రెంటచింతలకు ఆహ్వానించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. రెంటచింతలలో గాంధీతో గాంధీజీ లాలా లజపతిరాయ్ విద్యాలయాన్ని ప్రారంభింపజేశారు. అంటరానితన నిర్మూలన కోసం దళిత, సుగాలి బాలబాలికలను చేరదీసి విద్యను నేర్పించారు. కందుకూరి స్పూర్తితో తన కుమార్తెకు పునర్వివాహం జరిపించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న మటుపల్లిని రెండు పర్యాయాలు అరెసు చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. కలకత్తా జాతీయ కాంగ్రెస్ మహాసభలకు గుంటూరు జిల్లా ప్రతినిధిగా హాజ రయ్యారు. స్వాతంత్ర్య యోధులకు ఎత్తిపోతల వద్ద రహస్య స్థావ రాన్ని ఏర్పాటు చేసి వారికి ఆశ్రయాన్ని కల్పించారు[2]. గుర్రం మల్ల య్యకు విద్యను చెప్పించి ఆయన ఉన్నతికి వెన్నెముకగా నిలిచారు. ఫ్రెంచ్ చిత్రకారుడు డూజ్రాయల్ గోలి గ్రామంలోని పురాతన విగ్ర హాలను తరలించడానికి ప్రయత్నించగా, గ్రామస్తుల సహకారంతో అడుకున్నారు. ఆ విగ్రహాలను మద్రాసు పురావస్తు ప్రదర్శశాలకు చేర్పించడానికి కృషి చేశారు. ఆజన్మాంతం గాంధీ ఆశయాలకు అను గుణంగా నడిచిన మటుపల్లి 1961 జనవరి 24న అస్తమించారు.

మూలాలు

[మార్చు]