నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం
గోపీనాథ్ పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: ఎం. ఎఫ్. గోపీనాథ్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆత్మకథ, అనుభవాలు, జ్ఞాపకాలు
విభాగం (కళా ప్రక్రియ): వ్యక్తిగత అనుభవాలు
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్
విడుదల: సెప్టెంబర్ 28 2013, బషీర్ బాఘ్ ప్రెస్ క్లబ్
పేజీలు: 162


నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం డా. ఎం. ఎఫ్. గోపీనాథ్ తన సామాజిక అనుభవాల గురించి రాసిన పుస్తకం.

అల్లం రాజయ్య రాసిన ముందుమాట[మార్చు]

ఈ పుస్తకానికి ముందుమాటలో అల్లం రాజయ్య ఇలా రాసాడు: "పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం"