Jump to content

నిండుపున్నమి పండువెన్నెలలో

వికీపీడియా నుండి

నిండుపున్నమి పండువెన్నెలలో ఒక లలిత గీతం. దీనిని డా. దాశరథి కృష్ణమాచార్య రచించారు. రావు బాలసరస్వతీ దేవి గానం చేసిన ఈ పాట ఆకాశవాణిలో వినిపిస్తూ ఉండేది.

నిండుపున్నమి పండువెన్నెలలో

నిను చేరగా నేనెటుల రాగలనో!

నీలి నీలి ఆకశము నీడ, నే కాలిసవ్వడి లేక రాబోతే..

దొంగ తారలు తొంగి చూచెను! చందమామ దారి కాచెను!

నిండుపున్నమి పండువెన్నెలలో

నిను చేరగా నేనెటుల రాగలనో!

తెల్లతెల్లని బొండుమల్లెలతో తనువెల్ల చల్లగా రాచుకుంటేను!

నల్ల నల్లని గండుతుమ్మెదలు నావెంట పడి గల్లంతు చేసేను!

మనసు నీకై పరుగుతీసెను! నా తనువు నీకై వేచెను రా!

నిండుపున్నమి పండువెన్నెలలో

నిను చేరగా నేనెటుల రాగలనో!

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]