నిర్మలా జోషీ
సిస్టర్ నిర్మలా జోషీ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ | |
---|---|
జననం | నిర్మలా జోషీ 1934 జూలై 23 స్యాజ, నేపాల్ |
మరణం | 2015 జూన్ 23 కోల్‌కతా,పశ్చిమబెంగాల్,ఇండియా. | (వయసు 80)
చదువు | Master's degree in Political science, Doctor Juris, Graduate degree in Law |
మతం | Hinduism (1934-1958), Catholicism (1958-2015) |
నిర్మలా జోషీ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (జూలై 23, 1934 – జూన్ 23, 2015), "సిస్టర్ నిర్మల"గా సుపరిచితులు.ఆమె కాథలిక్ నన్ గా యున్నారు. ఆమె మదర్‌థెరిస్సా శిష్యురాలు.మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా సిస్టర్ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో మదర్‌థెరిస్సా తరువాత ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు స్వీకరించారు. సంస్ధ కార్యకలాపాలను మరింతగా 134 దేశాల వరకు విస్తరించారు.[1][2]
విషయ సూచిక
జీవిత విశేషాలు[మార్చు]
నిర్మల జోషీ,నీ కుసుమ్, 1934, జూలై 23[3] న బ్రాహ్మణ కుటుంబంలో నేపాల్ లోని స్యాజలో జన్మించారు.ఆమె 10మంది సహోదరులలో జ్యేష్ఠురాలు[4][5][6].ఆమె తండ్రి 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిష్ ఇండియా అర్మీలో అధికారిగా ఉండేవారు[6].ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి భారతదేశానికి తీసుకొనివచ్చారు. వారి కుటుంబం బ్రాహ్మణ కుటుంబమైనప్పటికీ ఆమె మౌంట్ కార్మెల్ లోని క్రిస్టియన్ మిషనరీస్ లో విద్యాభ్యాసం చేసారు. ఆ కాలంలో ఆమె మదర్ థెరీసా యొక్క సేవాభావాన్ని అలవరచుకొని ఆమెకు సహాయం అందించాలని భావించారు. వెంటనే సిస్టర్ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని క్రైస్తవ సన్యాసం తీసుకున్నారు.ఆమె మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో చేరి తన సేవలను కొనసాగించారు.[7].
జోషీ రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ డిగ్రీని న్యాయశాస్త్రంలో పొందారు[4][8] . ఆమె పనామా దేశానికి వెళ్ళి విదేశీ మిషన్ ను నడిపించిన మొదటి సిస్టర్స్ లో ఒకతె. 1976లో మదర్ థెరీసా వారసురాలిగా అత్యున్నత జనరల్ గా ఇనిస్టిట్యూట్ లో ఎన్నికైన తరువాత ఆమె 1997 వరకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రాంచ్ లను ప్రారంభించారు[8].
అవార్డులు[మార్చు]
సిస్టర్ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది[9][10].ఆమె యొక్క సుపీరియల్ జనరల్ కాలవ్యవధి 25 మార్చి 2009 నాటికి పూర్తయింది. ఆమె తరువాత ఆ స్థానంలో జర్మనీలో జన్మించిన "మేరీ ప్రేమ పియరిక్" అనే సిస్టర్ యున్నారు[6].
కొంతకాలం క్రితం సిస్టర్ నిర్మల అస్వస్థతకు గురయ్యారు. హృద్రోగ సమస్యతో ఆమె బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా 23 జూన్ 2015 ఉదయం కోల్‌కతాలో మరణించారు[11].
మూలాలు[మార్చు]
- ↑ Asianews
- ↑ Letter to Coworkers
- ↑ [1]
- ↑ 4.0 4.1 "We are 'little pencils' in God's hand". Eternal World Television Network. 2015. Retrieved June 24, 2015. Cite web requires
|website=
(help) - ↑ "Sister Nirmala is no more". Indian Express. 24 June 2015. Retrieved June 24, 2015. Cite web requires
|website=
(help) - ↑ 6.0 6.1 6.2 "Sister Nirmala Bio". Celebs Bio. 2015. Retrieved June 24, 2015. Cite web requires
|website=
(help) - ↑ "How India remembers Mother Teresa". Catholic Archdiocese of Melbourne. Retrieved September 11, 2012. Cite web requires
|website=
(help); Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ 8.0 8.1 "Indian-born nun to succeed Mother Teresa". CNN. March 13, 1997. Retrieved 2014-08-03. Cite web requires
|website=
(help) - ↑ "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Cite web requires
|website=
(help) - ↑ Padma Vibhushan
- ↑ "Sister Nirmala passes away - The Times of India". Retrieved 2015-06-23. Cite web requires
|website=
(help)
ఇతర లింకులు[మార్చు]
- Time: MOTHER TERESA: Filling the Big Sandals at the Wayback Machine (archived మే 22, 2011) Archived from the original[dead link] source.
- CWS interview with Mother Teresa's successor
- Indian-born nun to succeed Mother Teresa
- CS1 errors: missing periodical
- CS1 errors: markup
- All articles with dead external links
- Articles with dead external links from September 2012
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1934 జననాలు
- 2015 మరణాలు
- మిషనరీస్ అఫ్ ఛారిటీ
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు