నివారణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నివారణ (Prevention) ఒక వ్యాధి, ప్రమాదం మొదలైన బాధలు కలుగకుంటా జాగ్రత్త వహించడం.

  • వ్యాధి నివారణలో కొన్ని వ్యాధులు రాకుండా ముందుగా టీకాలు తీసుకుంటాము. అంటువ్యాధులు వ్యాపించకుండా వ్యాధిగ్రస్తుల్ని వేరుగా ఆసుపత్రులలో ఉంచి వైద్యం చేస్తాము. చేతులు శుభ్రం చేసుకోవడం వ్యాధి నివారణలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
    • ప్రాథమిక నివారణ : వ్యాధి పూర్తిగా రాకుండా జాగ్రత్త తీసుకోవడం. ఉదాహరణ: ఆరోగ్య పరిరక్షణ విధానాలు
    • ద్వితీయ నివారణ : వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించడం, అందుమూలంగా వాటి తీవ్రత పెరగకుండా జాగ్రత్త వహించవచ్చును.
    • తృతీయ నివారణ : నిర్ధారించబడిన వ్యాధులనుండి త్వరగా కోలుకొనే విధానాలు, ఇతర కష్టాలు కలుగుకుండా జాగ్రత్త వహించడం>
  • రహదారి ప్రమాదాలు జరుగకుండా రహదారి నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడం ప్రధానమైనవి. అగ్ని ప్రమాదాలలో మంటలు వ్యాపించడాన్ని నిరోధించడం అతి కీలకమైనది.
  • నేరాలు జరుగకుండా నివారించే పద్ధతులు పాటించి మనల్ని రక్షించుకోవచ్చును.
  • కొన్ని పరికరాలు ఎక్కువకాలం పనిచేయడానికి వాటికి నిర్ణీత కాల వ్యవధిలో నివారణ చర్యలు తీసుకోవలసి వుంటుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=నివారణ&oldid=3051913" నుండి వెలికితీశారు