నిషా గణేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిషా గణేష్
జననం
నిషా కృష్ణన్

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–2018; 2020–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

నిషా గణేష్ భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా నటించింది. మహాభారతం అనే టీవీ సిరీస్‌లో ద్రౌపది పాత్రను పోషించడం, సన్ టీవీలో సూర్య వణక్కం వంటి షోలను హోస్ట్ చేయడం ద్వారా ఆమె బుల్లితెర నటిగా ప్రసిద్ధిచెందింది. ఆ తరువాత ఆమె చలన చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించడం మొదలుపెట్టింది.[1]

కెరీర్[మార్చు]

నిషా కృష్ణన్ కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే విజయ్ టీవీ కన కన్నుమ్ కలంగల్ కల్లోరియిన్ కధైలో నటించడం ప్రారంభించింది. ఆ తరువాత శరవణన్ మీనచ్చిలో తేన్మొళిగా నటించింది. ఆమె మహాభారతం అనే టీవీ సిరీస్‌లో ద్రౌపది పాత్రను పోషించడం ద్వారా జనాదరణ పొందింది. ఆ తర్వాత సూర్య వనక్కం, కిచెన్ గలాట్టా, సన్ సింగర్ (సీజన్-2) వంటి షోలను హోస్ట్ చేసింది. అంతేకాకుండా సన్ టీవీలో రాగిణిగా దేవమగల్ అనే టీవీ సిరీస్‌లో చేసింది.[2]

మీడియా విద్యార్థిగా, ఆమె తన విద్యాభ్యాసం సమయంలో షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో చురుకుగా పాల్గొంది. బెంచ్ టాకీస్ - ది ఫస్ట్ బెంచ్ (2015), చెన్నై ఉంగలై అన్బుదన్ వరవెర్కిరతు (2015) చిత్రాలను రూపొందించేటప్పుడు ఆమె వారితో కలిసి పనిచేసింది. ఆమె ఫీచర్ ఫిల్మ్‌లలో సహాయక పాత్రలలో కూడా నటించింది, ముఖ్యంగా ఇవాన్ వెరమతిరి (2013), నాన్ సిగప్పు మనితన్ (2014)లలో పాత్రలను పోషించింది.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నిషా కృష్ణన్ ఫిబ్రవరి 2015లో నటుడు గణేష్ వెంకట్రామన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ జంట 2015 నవంబరు 22న వివాహం చేసుకున్నారు. జూన్ 2019లో ఆమె వారి మొదటి బిడ్డ సమైరాకు జన్మనిచ్చింది.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. Raghavan, Nikhil (11 April 2015). "Etcetera". The Hindu. Retrieved 15 November 2015.
  2. "Nisha Ganesh is elated to host a TV show again".
  3. "Actress Nisha Krishnan talks about Vil Ambu and her other projects". Behindwoods.com. 25 April 2015. Retrieved 15 November 2015.
  4. "Ganesh Venkatraman's wedding date is fixed for the 22nd November". Behindwoods.com. 4 November 2015. Retrieved 15 November 2015.
  5. "Wedding bells for Ganesh Venkatraman - Tamil Movie News". IndiaGlitz.com. 9 February 2015. Archived from the original on 2 December 2015. Retrieved 15 November 2015.
  6. "Ganesh Venkatram's filmy proposal to Nisha". The Times of India. 10 February 2015. Retrieved 15 November 2015.