నిషా దేశాయ్ బిస్వాల్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిషా దేశాయ్ బిస్వాల్

నిషా దేశాయ్ బిస్వాల్‌ భారత సంతతికి చెందిన అమెరికన్ మహిళ. 2013 లో అధ్యక్షుడు బారక్ ఒబామా ఈమెను దక్షిణాసియా వ్యవహారాల విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా నామినేట్ చేయడంతో వార్తలలోకి వచ్చింది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) లో ఆసియా విభాగానికి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న బిస్వాల్... రాబర్ట్ బ్లేక్ స్థానంలో పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో భారత సంతతి వ్యక్తి దక్షిణాసియా వ్యవహారాలకు సారథ్యం వహించనుండటం ఇదే తొలిసారి అవుతుంది. బిస్వాల్‌తోపాటు ఏడుగురు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ స్థాయి పదవులకు నియామకాలు చేపడుతూ ఒబామా 2013, ఆగస్టు 8న ఉత్తర్వులు జారీచేశారు.

అంకితభావంతో పనిచేస్తున్న వీరు అమెరికా ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఒబామా ఒక ప్రకటనలో కాంక్షించారు. బిస్వాల్ భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లలో అమెరికా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ నియామకంపై బిస్వాల్ హర్షం వ్యక్తంచేశారు. గ్రామీణ భారతం నుంచి వచ్చిన తన తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారని, తన కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు.

నేపధ్యము[మార్చు]

వర్జీనియా వర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందిన బిస్వాల్ యూఎస్‌ఏఐడీలో 2010 నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2005- 2010 వరకు అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల సబ్‌కమిటీలో మెజారిటీ క్లర్క్‌గా పనిచేశారు. 2002-05 వరకు ఇంటరాక్షన్‌లో విధాన, సలహా డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999-2002 వరకు ప్రతినిధుల సభలో అంతర్జాతీయ సంబంధాల కమిటీలో, 1995-99 వరకు యూఎస్‌ఎఐడీలో పలు హోదాల్లో, 1993-95 వరకు అమెరికన్ రెడ్‌క్రాస్‌లో పనిచేశారు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

ఈమె భర్త సుబ్రత్, ఇద్దరు కుమార్తెలు సఫ్యా, కయా.

బయటి లంకెలు[మార్చు]