Jump to content

నీటి పాచి

వికీపీడియా నుండి

494

వర్గము
పుష్పరహితము, వంశము: అవయవ అరహితము ఉప వంశము (శేవతము)
నీటి పాచి

నీటి పాచి మంచి నీళ్ళలోనే గాక ఉప్పు నీళ్ళలోను సముద్రముల లోను కూడా నుండును. ఈ పాచిలో కంటికి కాన రాని యొక్కొక కణముగానె యున్న మొక్కలును వందల కొలది అడుగుల పొడుగున్నవియు గలవు. ఎంత పొడుగు ఎంత వెడల్పున్నను నవి కణముల సముదాయమె గాని వానిలో ఆరు కొమ్మవేరు అనుభేదము లేమియు లేవు. ఈ లక్షణములో బూజును పోలి యున్నవి. విడివిడిగా నుండు కొన్ని కణములకు నత్తల మీద గుల్లయున్నట్లు గుల్ల ఉంది. ఆగుల్లలోనే మూల పదార్థముండును. అది పూర్తిగా నెదిగిన పిదప మూల పదారథము పైకి వచ్చు గుల్ల నుండి విడిపోయి రెండు తునకలుగా నగును. ఒక్కొక తునకకు తిరిగి గుల్ల ఏర్పడును. అవియు మొదటి దాని వలెనే పెరుగును. లేదా, గుల్లలో నుండగనే రెండుగా విడును. ఆగుల్ల రెండు ఆలు చిప్పలు గలిసి యున్నట్లు ఉంది. కావున ఒక్కొక్క భాగము నంటి ఒక్కొక చిప్ప బోవును, తరువాత వానికి రెండవ చిప్ప వచ్చును. ఈవచ్చెడు రెండవ చిప్ప మొదటి దాని కంటే చిన్నదిగా నుండును. ఈ రీతిని కూడా సంతాఅవృద్ధి యగు చుండును గాని, రాను రాను అకణములు చిన్నవి కావలసి యున్నది. అవి అట్లు చిన్నవి కూడా నగును. గాని మిక్కిలి చిన్నవై నపుడు మూల పదార్థము బైటకు వచ్చి పెద్దదిగా బెరిగి విభజన పొందు చున్నది. వీనిలో కూడా రెండింటి సంయోగము గలదు. గాని వానిలో స్త్రీ పురుష వివక్షత లేదు.కొన్ని కణములకు మృదు రోమములున్నవి. కొన్ని సిద్ధ బీజముల మూలమున సంతాన వృద్ధి గావించు కొను చున్నవి. కొన్ని సంయోగినులై వ్యాపించు చున్నవి.

మీరు జీవ శాస్త్రములోచదివిన పసిరక పోగును, వారి పర్ణియ నీటి పాచియే అవి రెండును ఆకు పచ్చగానే యున్నవి గాని సముద్రములో పెరుగు కొన్ని జాతుల నీటి పాచి ఎర్రగాను, కొన్ని దోగుమ వర్ణము గాను నుండును. వీని రంగును బట్టియు కొన్ని ఇతర లక్షణములను బట్టియు మూడు వర్ణములుగ విభజించి యున్నారు. సముద్రములలో బెరుగు నీటి పాచిలో సంతాన వృద్ధి కావించు కొనుటకు స్తూల బీజాశయములు, సూక్ష్మ బీజాయములు కూడా గలుగు చున్నవి. కొన్నిటిలో రెండును నొక గిన్నెవలె నున్న దానిలో బుట్టి, దాని నుండి విడి కెరటముల ల్మూలమున బయటకు వచ్చి స్థూల బీజములు, సూక్ష్మ బీజములు సంయోగము బొందు చున్నవి. వీని గురించి పూర్తిగా తెలిసికొనుట సూక్ష్మ దర్శని యున్న యెడల గాని సాధ్యము గాదు కనుక, ఎక్కువగా వ్రాయ లేదు. నీటి పాచి లాభము గానె యగుచున్నది. అది నీటిలో నుండు జంతువులకు కొన్నిటి కాహారము. దానిని కాల్చి బూడిదనుండి ఆయెడిను చేస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=నీటి_పాచి&oldid=2432930" నుండి వెలికితీశారు