నీనా ఆర్య
జననం | 1902 మార్చి 5 |
---|---|
మరణం | 1998 జూలై 26 | (వయసు 96)
జీవిత భాగస్వామి | శ్రీకాంత్ జైరంజన్ దాస్ |
నీరా ఆర్య 1902 మార్చి 5న ఉత్తర ప్రదేశ్ లోని ఖేక్రా నగర్ లో వ్యాపారవేత్త సేథ్ ఛజుమాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి నిజమైన జాతీయవాది, స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భాగం కావాలనే దార్శనికత ఎల్లప్పుడూ ఉండేది. కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా సాగడంతో ( అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తా అతని వ్యాపారానికి కేంద్రంగా ఉంది) కారణంతో కలకత్తాలో ఆమె చదువు కొనసాగింది. ఆ సమయములో బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు భాషలతోపాటు మరి కొన్ని భాషలు నేర్చుకుంది. బ్రిటిష్ లో పనిచేస్తున్న సిఐడి ఇన్స్పెక్టర్ "శ్రీకాంత్ జైరంజన్ దాస్"ను వివాహం చేసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు వేరు నీరా ఆర్య దేశ భక్తి, జాతీయవాది, కానీ భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్ బ్రిటిష్ సేవకుడు[1] .
దేశ భక్తి
[మార్చు]భారతదేశం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది వీరులు తమ ప్రాణ త్యాగం చేశారు. కొంత మంది అమర వీరుల చరిత్రలు ప్రజలకు తెలియదు. అటువంటి వారిలో మహిళా స్వాతంత్ర్య సమర యోధులలో నీరా ఆర్య ఒకరు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు. నీరా ఆర్య భర్త శ్రీకాంత్ జైరంజన్ దాస్ బ్రిటిష్ ప్రభుత్వంలో సి.ఐ.డి. ఉద్యోగం. బ్రిటీష్ ప్రభుత్వం శ్రీకాంత్ జైరంజన్ దాస్ కు నేతాజీ చంద్రబోస్ ను చంపే బాధ్యతను అప్పగించింది. అటువంటి సమయంలో నీరా ఆర్య శ్రీకాంత్ ను వివాహం చేసుకున్నది. నేతాజీ ప్రాణాలను కాపాడతానని నీరా వాగ్దానం చేసింది. ఒకప్పుడు జైరంజన్ దాస్ నేతాజీ పై కాల్పులు జరిపాడు, కానీ అదృష్టవశాత్తూ, అతను మరణం నుండి తప్పించుకున్నాడు కానీ బుల్లెట్ అతని డ్రైవర్ ను తాకింది. ఈ విషయం తెలిసి నీరా ఆర్యకు దాని గురించి తెలిసినప్పుడు ఆమె తన భర్త శ్రీకాంత్ జై రంజన్ దాస్ కత్తితో పొడిచి చంపింది[2] .
ఆత్మకథ
[మార్చు]నీరా ఆర్య లొంగిపోయిన తరువాత, ఎర్రఫోర్ట్ లో విచారణ జరిగినప్పుడు, ఖైదీలందరినీ విడుదల చేశారు, నీరా ఆర్యకు మాత్రం తన భర్త హత్యకేసులో శిక్ష విధించబడింది, ఆమెను కాలాపాని జైలుకు (సెల్యులార్ జైలు, అండమాన్) పంపబడి, హింసించబడింది. నీరా తన ఆత్మకథను వ్రాసింది. ఆమె హృదయపూర్వక కథలను రాసిన ఉర్దూ రచయిత "ఫర్హానా తాజ్"కు తన నిరాశానిస్పృహల జీవిత కథలను పంచుకుంది.[3] ఆ అత్మకథ లోని హృదయపూర్వక భాగాలలో ఒకటి నేను ( నీరు ఆర్య ) విచారణలో ఉన్నప్పుడు, నేను కాలాపాని జైలు పంపబడినప్పుడు, నీరా ను కలకత్తా జైలు నుండి అండమాన్ కు తీసుకురాబడ్డాను, అక్కడ మాకు చిన్న సెల్స్ ఉన్నాయి. మహిళలు అలాగే వారి శిక్షను అనుభవిస్తున్నారు. ఆ మహిళలు రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ లోతైన సముద్రంలో తెలియని ద్వీపంలో నివసిస్తున్నప్పుడు నాకు స్వేచ్ఛ ఎలా లభిస్తుందని నా మనస్సులో ఆందోళన కలిగింది, ఎంత చల్లగా ఉన్నప్పటికీ నేలపై నిద్రపోయాను. 12 గంటల సమయంలో ఒక గార్డు రెండు దుప్పట్లతో వచ్చి వాటిని నాపై విసిరాడు, మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అప్పటికి, నా చేతులు, కాళ్ళ చుట్టూ కట్టిన గొలుసులను ఎలా వదిలించుకోవాలో నా ఆందోళన, నేను నా మాతృభూమి నుండి విడిపోతున్న భావన కలిగి ఉన్నాను. మరుసటి రోజు బ్లాక్ స్మిత్ వచ్చినప్పుడు అతను నా చేతి నుండి గొలుసును కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను నా చేతి చర్మాన్ని కొద్దిగా తీసివేశాడు, నేను పట్టించుకోలేదు. అతను సుత్తి సహాయంతో నా కాళ్ళ నుండి సంకెళ్లను కత్తిరించడం ప్రారంభించినప్పుడు అతను సంకెళ్లకు బదులుగా నా ఎముకలను 2-3 సార్లు కొట్టాడు. ఇది చాలా బాధగా ఉన్నది అని చెప్పాను; "మీరు నా కాళ్లను కొడుతున్నారని మీరు గుడ్డిగా వారా"? అప్పుడు అతను జవాబిచ్చాడు, నేను మీ హృదయాన్ని కూడా కొట్టగలను, దాని గురించి మీరు ఏమి చేయగలరు? జైలర్ బదులిచ్చాడు, మీరు అబద్ధం చెప్పారు అతను ( నేతాజీ ) ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను అవును అతను సజీవంగా ఉన్నాడు అని సమాధానం చెప్పాను. అప్పుడు జైలర్ అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు?
నేను ( నీరా) నా మనస్సులో నా హృదయంలో (గుండెలో) అని బదులిచ్చాను!
జైలర్ కోపంతో, "అప్పుడు మేము నేతాజీని మీ హృదయం (గుండె) నుండి తొలగిస్తాము" అని అన్నాడు. జైలర్ నన్ను అనుచితంగా తాకాడు, అసభ్యంగా ప్రవర్తించాడు . నీరా (నా) ఛాతీ ప్రాంతంలో నా వస్త్రాన్ని చీల్చమని కమ్మరిని సూచించాడు. కమ్మరి వెంటనే కత్తెర తీసుకున్నాడు, దానిని కత్తిరించడానికి నా కుడి రొమ్మును నొక్కడం ప్రారంభించాడు. నీరా భాదతో విలవిలలాడింది . జైలర్ "కత్తి పదునుగా లేనందువల్ల బతికి పోయావు.." అంటూ వదిలేశాడు జైలర్. ఇటువంటి బాధలను నీరా ఆర్య స్వాతంత్య్రం కొరకు, తన భర్తను చంపివేసిన మహనీయురాలు నీరా ఆర్య [1].
మరణం
[మార్చు]నీరా ఆర్య వంటి స్వాతంత్ర్య సమరయోధుల వంటి కథలు చాలా ఉన్నాయి, వారు ఈ దేశానికి దోహదపడ్డారు, కానీ దురదృష్టవశాత్తు, పాఠ్యపుస్తకాలలో గుర్తింపు పొందలేదు, హంతకులు, దేశ ద్రోహుల చరిత్రలు కీర్తించబడ్డాయి. నిజమైన యోధులకు గౌరవం ఎప్పుడూ లభించలేదు, నీరా ఆర్య తన జీవితంలో చివరి రోజులను పూలు అమ్ముతూ గడిపింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా లోని ఒక చిన్న గుడిసె (కుటీరం) లో నివసించారు. కానీ ఆమె కుటీరాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించడంతో ప్రభుత్వం కూల్చివేసింది. ఆమె 1998 జూలై 26 మరణించింది.[1] నీరా ఆర్యకు దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఎటువంటి గుర్తింపు / గౌరవం పొందలేదు[1][2] .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Desk, TM News (2020-12-30). "Did you know a brave woman who let her "Breast" cutoff to protect Netaji Subhash Chandra Bose!". Telangana Mata. Archived from the original on 2021-08-17. Retrieved 2021-09-08.
- ↑ 2.0 2.1 "బోస్ కోసం భర్తను చంపి." EENADU. Archived from the original on 2021-09-08. Retrieved 2021-09-08.
- ↑ Krishh (2021-04-14). "When Her Breast Was Cut off Apart from Her Body in Prison". Medium. Retrieved 2021-09-08.