నీలంరాజు గంగా ప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nనీలంరాజు గంగా ప్రసాదరావు
నీలంరాజు గంగా ప్రసాదరావు
జననం(1927-09-05)1927 సెప్టెంబరు 5
కొరిసపాడు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం2016 జూలై 27(2016-07-27) (వయసు 88)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నివాసం
జాతీయతIndian
రంగములుGenetics
Plant breeding
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలు
ప్రసిద్ధిDevelopment of hybrid sorghum
ముఖ్యమైన పురస్కారాలు1966 C. Subramaniam Gold Medal
1966 Shanti Swarup Bhatnagar Prize
1974 Rafi Ahmed Kidwai Award
1979 VASWIK Award
2003 Atma Gaurav Award
2008 Distinguished Agricultural Scientist Award

నీలంరాజు గంగా ప్రసాదరావు  (1927–2016) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హైబ్రిడ్ జొన్న పితామహుడు. ఆయన కృషి వల్ల హైబ్రిడ్ జొన్న రకాలు సీఎస్‌హెచ్ 1, సీఎస్‌హెచ్ 5, సీఎస్‌హెచ్ 9 వంటివి దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి.[1] దేశవాళీ పత్తి, బఠానీ, ఆముదం తదితర పంటల అభివృద్ధికి ప్రసాదరావు విశేష కృషి చేశారు. ఆయన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పలు పదవులు నిర్వహించారు. ఆయన వసంతరావ్ నాయక్ మరాథ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగానూ, ఇండియన్ కౌన్సి ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చె లో సభ్యునిగా తన సేవలనందించాడు.[2] ఆయనకు 1966 లో శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డు జివశాస్త్ర రంగంలో లభించింది.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన సెప్టెబరు 5, 1927 న [4] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో జన్మించాడు. బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ బి.యస్సీ డిగ్రీని పొందాడు.[5] ఆయన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ పొందిన తరువాత 1958 లో బీహార్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందాడు. చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ ఆయనను డాక్టర్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందించింది.[6] ఆయన వృత్తి జీవితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలొ అధ్యాపకునిగా ప్రారంభమైనది. కానీ తరువాత ఆయన ఇండియన్ అగ్రికచ్లరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో జొన్న యొక్క ప్లాంట్ బ్రీడర్ గా చేరాడు. ఆయన ఆల్ ఇండియా జొన్న అభివృద్ది ప్రాజెక్టు కు కో ఆర్డినేటరుగానూ, హైదరాబాదు లోని ఐ.ఎ.ఆర్.ఐ కు అధితిగానూ సేవలనందించారు. ఆయన హైదరాబాదులోని వ్యవసాయ కళాశాలలోనూ, న్యూఢిల్లీ లోని ఐ.ఎ.ఆర్.ఐ కాంపస్ లలో ఫాకల్టీ సభ్యునిగా పనిచెసాడు. ఆయన వసంతరావు నాయిక్ మరాఠ్వాడా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం లో వైస్ ఛాన్సలర్ గా పనిచేసే ముందు పశ్చిమ ఆఫ్రికాలోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద సెమి-అరిడ్ ట్రాపిక్స్ లో జొన్న పెంపకందారునిగా సేవలనందించాడు. యునైటెడ్ స్టేట్స్ లోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ లో కన్సల్టెండ్ గా కూడా పనిచేసాడు. ఆయన కృషి వల్ల హైబ్రిడ్ జొన్న రకాలు సీఎస్‌హెచ్ 1, సీఎస్‌హెచ్ 5, సీఎస్‌హెచ్ 9 వంటివి దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి.[7] భారతదేశం, ఆఫ్రికా దేశాలలో ఖరీఫ్ కాలంలో పంటలకు ఇవి ఎంతో సహాయపడ్డాయి.[7]

ఆయన ఇతర పంటలైన ప్రత్తి, కందులు, ఆముదం లలో కొత్త వ్యవసాయ విధానాలను కూడా ప్రవేశపెట్టాడు. ఆయన సుమారు 200 పరిశోధనా పత్రాలను వివిధ జర్నల్స్ లలో ప్రచురించాడు.[8]

ఆయన జూలై 27, 2016 న తన 88 వ యేట హైదబాదులో మరణించాడు.[9]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

 • 1979 : ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారి ఫెలోషిప్.
 • 1988 : నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అకాడమీ ఫెలోషిప్.[10]
 • నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ ఫెలోషిప్.[11]
 • 1966 : శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం[4].
 • 1966 : సి.సుబ్రహ్మణ్యన్ బంగారుపతకం.[8]
 • 1974 : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క రఫి అహ్మద్ కిడ్వాయి పురస్కారం, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెచె పురస్కారం.[2]
 • 2003 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఆత్మ గౌరవ పురస్కారం, 2008 లో అగ్రికల్చరల్ సైన్స్ పురస్కారం[8] Acharya N.G. Ranga Agricultural University has instituted an annual award in his honor, for recognizing academic excellence at graduate level courses.[12]

మూలాలు[మార్చు]

 1. "Agricultural scientist Dr. Neelamraju Ganga Prasada Rao passed away". Universal Coaching Centre. July 29, 2016. Archived from the original on 2016-09-23. Retrieved September 6, 2016.
 2. 2.0 2.1 "Deceased Fellow". Inidan National Science Academy. 2016. Archived from the original on 2017-04-27. Retrieved September 6, 2016.
 3. "View Bhatnagar Awardees". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved September 4, 2016.
 4. 4.0 4.1 "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved September 4, 2016.
 5. "Neelamraju Ganga Prasada Rao, Father of Hybrid Sorghum passes away". Current Affairs. July 28, 2016. Archived from the original on 2017-04-23. Retrieved September 6, 2016.
 6. "Agriculture scientist Dr Neelamraju Ganga Prasada Rao passes away". The Hans India. July 28, 2016. Retrieved September 6, 2016.
 7. 7.0 7.1 "Handbook of Shanti Swarup Bhatnagar Prize Winners" (PDF). Council of Scientific and Industrial Research. 1999. p. 34. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved September 4, 2016.
 8. 8.0 8.1 8.2 "'Father of Hybrid Sorghum' passes away". The Hindu. July 28, 2016. Retrieved September 6, 2016.
 9. "Father of Hybrid Sorghum Neelamraju Ganga Prasada Rao passes away". Jagaran Josh. July 28, 2016. Retrieved September 6, 2016.
 10. "NASI fellows". National Academy of Sciences, India. 2016. Archived from the original on 2016-03-15. Retrieved September 6, 2016.
 11. "NAAS fellows". National Academy of Agricultural Sciences. 2016. Archived from the original on 2017-06-22. Retrieved September 6, 2016.
 12. "Neelamraju Ganga Prasada Rao & Kamala Gold Medal". Blue Card. 2016. Archived from the original on 2017-05-10. Retrieved September 6, 2016.